శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది.

హెచ్చరిక : ఇక్కడ పోస్ట్ చేసే విషయాలు అన్ని వయసులవారు చదివేవి కావు .18 ఏళ్ళ లోపు వ్యక్తులు ఈ బ్లాగ్ నుండి నిష్క్రమించడం మంచిది జాగూరతతో ఉండగలరు .

మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది. అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే. ఏ పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగార కేళి ఇస్తుంది. ఇక శృంగారం వలన లాభాలు చెప్పుకోవాలంటే అదో పెద్ద మహా భారతం అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని ముఖ్య లాభాలను తెలుసుకుందాం.


) శృంగారం ఒత్తిడిని తగ్గిస్తుంది, బి) క్యాలరీలను కరిగిస్తుంది, సి) రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, డి) బాధ నివారణ శక్తిని పెంచుతుంది,) ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది, ఎఫ్) గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది, జి) కేన్సర్ రిస్క్ తగ్గిస్తుంది, హెచ్) ఆత్మీయతను పెంచుతుంది,) కండరాల శక్తిని పెంచుతుంది, జె) చక్కని నిద్రనిస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా ఎన్నెన్నో. ఒక్క మాటలో చెప్పాలంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని దివ్యౌషధం శృంగారం. “
An apple a day keeps the doctor away” అన్నది నాటి మాట “A hot sex story a day keeps the doctor away” అన్నది నేటి మాట.

అంతటి ప్రాధాన్యత గల శృంగారాన్ని మన భారత దేశంలో ఇప్పటికి ఒక చాటు మాటు వ్యవహారంగా, ఇక సనాతనులైతే పాపంగా పరిగణిస్తుంటారు. ఆ విషయం చర్చించడమే ఒక పెద్ద అపచారంగా భావిస్తుంటారు. శృంగారమన్నది ఒక మహా యజ్ఞం. శృంగారం ఒక సహజమైన, సృజనాత్మకమైన కళ. రెండు ఆత్మలు, మనసులు, తనువులు కలసి ఒకరినొకరు శోధించుకుంటూ, శరీరమనే ప్రపంచంలో కొండల్ని, లోయల్ని, జలపాతాల్ని, ఎడారులని, ఇసుకతిన్నెలని, అడవులని, మిట్టపల్లాలని, మైదానాల్ని స్వర్గద్వారాలని అన్వేషిస్తూ చేసే అపూరూపమైన మహా యజ్ఞమే శృంగారం. కాని ఇప్పటికి మన దేశంలో ఎనభై శాతం కంటే ఎక్కువ మంది దంపతులు ఈ అపురూపమైన ప్రక్రియను ఏదో మొక్కుబడి వ్యవహారంగా ఐదు పది నిమిషాలలో ముగించి చేతులు దులుపుకుంటారు. అటువంటి వారికి నా ఓ చిన్న విన్నపం ఏమిటంటే... ఇప్పటికి మించిపోయిందేమి లేదు... ఒక్కసారి హద్దులు ఎల్లలు మరచి మనసారా శృంగారాన్ని ఆస్వాదించి చూడండి. అ తరువాత మీరు “अब जीनॆ का असलि मजा आ रहा है” అనకపోతే ఒట్టే.
ఇక శృంగారంలో బూతుల పాత్రెంత అని అలోచిస్తే.... నా ఉద్యేశ్యం ప్రకారం బూతు లేని శృంగారం మషాలా లేని కూరలాంటిది, ఉప్పు లేని పప్పు వంటిది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రాణంలేని శరీరం వంటిది. ఎందుకంటే రాజైనా రైతైనా, పి.ఎమ్ అయినా సి.ఎమ్ అయినా, కూలోడయినా సి.ఇ.ఓ అయినా, హై క్లాస్ అయినా లో క్లాస్ అయినా, ప్యూన్ అయినా మానేజర్ అయినా, పోలిటెక్ అయినా ఎమ్ టెక్ అయినా, డ్రైవర్ అయినా పైలట్ అయినా, క్లాస్ అయినా మాస్ అయినా, ఆడైనా మగైనా ఎవరైనా సరే పక్కమీదొచ్చేసరికి అన్ని మరచి పచ్చి బూతులు మాట్లాడవలసిందే. అప్పుడే శృంగారానికి పరమార్ధం లభిస్తుంది. అందుకే నేను జీవితంలో రెండు సూత్రాలని ఎల్లప్పుడు పాటించాలని “నభూతో నభవిష్యతి” ని మార్చి “నబూతో నభవిష్యతి” గా అంటే బూతు లేనిదే భవిష్యత్తు లేదని, ఇంకా “కామాతురాణాం నభయం నలజ్జ” అని స్త్రిక్ట్ గా వాటిని ఫాలో అయిపోతుంటాను.
ఇక ఈసుందరి శృంగార కథలు అన్న టైటిల్ చూసి నా కధలేమో వీర లెవెల్లో ప్రాచీన కాల శృంగార కావ్యాల లా వుంటాయని ఊహించి చదవడాని వస్తే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. అటువంటి వారికి ముందే హెచ్చరిక. ఈ శృంగార కధల్లో అతి రమ్య మైన పచ్చి బూతులు వీర లెవెల్లో వుంటాయి కాబట్టి అవి నచ్చనివారు ఈ కధల జోలికి రావద్దని నా సహృదయపూర్వక మనవి.

ఈ కథలు కేవలం కల్పితం. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు ఎవర్ని ఉద్దేశించినవి కావు. మీకు బూతులు, అశ్లీల పదాలు, కథలు వంటివి నచ్చకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ చాలా నీచమైన, హేయమైన సందర్భాలు ఉండవచ్చు. మిగిలినది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం.




Monday, January 27, 2014

వాత్స్యాయన కామశాస్త్రం-----------పార్ట్ 2

రతిక్రీడలో స్త్రీకి భావప్రాప్తి కలిగిందా లేదా అని తెలుసుకోవడం ఎలా :: వాత్స్యాయన కామశాస్త్రం Part 7

రతి క్రీడలో స్త్రీకి భావప్రాప్తి కలిగినప్పుడే పురుషునికి ఆనందం కలుగుతుంది. వీర్య
స్కలనంతో పురుషుడు తృప్తి చెందుతాడు.
ఆ సమయానికి స్త్రీకి భావప్రాప్తి కలగకపోతే ఆమె బాధ వర్ణనాతీతంగా ఉంటుంది.

రతిక్రీడలో స్త్రీకి భావప్రాప్తి కలిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఆమె హావ భావాలే ఆధారం. సంభోగంలో స్త్రీకి భావప్రాప్తి కలిగినప్పుడు

అప్పటి వరకు బిగింపులో వున్న ఆమె శరీరం సడలిపోతుంది.
కనులు మూతపడతాయి.
ఆమెలో అప్పటివరకు ఉన్న సిగ్గుతెరలు తొలగిపోతాయి.
మరింతగా రతిని కోరుకుంటూ పురుషుని అల్లుకుపోతుంది.
భావప్రాప్తి సమయంలో స్త్రీ తన చేతులు తీవ్రంగా విదిలిస్తుంది.
శరీరమంతా చమటలు పడాతాయి.
పురుషునిపై దంత క్షతాలు చేస్తుంది.
పురుషుడు తనపై నుంచి లేవకుండా గట్టిగా హత్తుకుంటూ అల్లుకుపోతుంది.
ముద్దుల వర్షం కురిపిస్తుంది.
తన కాళ్లతో అతడి కాళ్లను తీగలా అల్లేస్తుంది.
తన పాదాలతో నొక్కుతుంది.
పురుషుని కన్నా ముందు తనకు సుఖం కలిగితే పురుషుని కిందకు పడదోసి అతనిపై పడి పురుషునిలా ప్రవర్తిస్తుంది.

స్త్రీకి కలిగే భావప్రాప్తి లక్షణాలివి.
------------------------------------------------

సాధారణంగా ఉద్రేకపడిపోయే పురుషునికే స్త్రీకన్నా ముందుగా సుఖ ప్రాప్తి కలిగి వీర్య స్కలనం కలుగుతుంది. అందువల్ల పురుషుడు ముందుగా స్త్రీని రతిక్రీడకు ఉద్యుక్తురాలిని చేయాలి. పురుషుడు తనకు కోరిక కలిగిన వెంటనే రతికి ఉపక్రమించకుండా ముందుగా స్త్రీని ఆలింగన, చుంబన, దంత నఖ క్షతాదులతో రెచ్చగొట్టాలి. అప్పుడామె రతి క్రీడకు మానసికంగా, శారీరకంగా సన్నద్ధం అవుతుంది.
సంభోగ క్రియ గురించి వాత్స్యాయనుడు అరవై నాలుగు ప్రకరణాలలో వివరించారు. దీనిని చతుష్షష్టి అని కూడా అంటారు. నిజానికి కళలను కూడా 64 రకాలని విభజించారు. ఆ కళల సమూహమే చతుష్షష్టి అని కూడా కొందరంటారు. ప్రస్తుతం వాత్స్యాయనుడు వివరించిన చతుష్షష్టి స్వరూపాన్ని, అందలి అంశాలనూ తెలుసుకుందాం.


1. ఆలింగనం,
2. చుంబనం,
3. దంత క్షతం,
4. నఖక్షతం,
5. సీత్కారం,
6. పాణిఘాతం,
7. సందశనం,
8. ఉపనృతం,
9. ఉపనృప్తం,
10. వరాయితం అని పది అంగాలున్నాయి.
ఇవి రుగ్వేదంలో పది రుక్కులున్నాయి.

దీనిలో ఆలింగనం అంటే కౌగిలించుకోవడం.
చుంబనం అంటే ముద్దు పెట్టుకోవడం.
నఖక్షతం అంటే గోళ్లతో గిచ్చడం లేదా రక్కడం.
దంత క్షతం అంటే పళ్లతో గిచ్చడం.
సంవేశనం అంటే తత్తరపాటుతో పడుకోవడం.
సీత్కృతం అంటే చలిగా వున్నప్పుడు వణికినట్లుగా రతి సమయంలో రకరకాల ధ్వనులు చేయడం.
ఔపరిష్టం అంటే నోట్లో నోరు పెట్టి చుంబించడం అని వాత్స్యాయనుడు వివరించారు.


ఆలింగనాది క్రియలలో అనేక రకాలున్నాయి. అసలు ఆలింగనానికి ప్రేరణ ఏమిటి ఇత్యాది విషయాలను వాత్స్యాయనుడు ఈ విధంగా వివరిస్తున్నారు.

ప్రేమికులు మొదట చేయవలసిన పని ముద్దు పెట్టుకోవడం కాదు.
మొదట కౌగిలించుకోవాలి. ఆ తర్వాత ముద్దు పెట్టుకోవాలి.

పరస్పర అనురాగ పూరితులైన ప్రేమికులకు మొదట ఒకరినొకరు కౌగిలించుకోవాలనే కోరిక కలుగుతుంది తమ ప్రేమను సూచిచుకోవడానికి, ఒకరి సాన్నిహిత్యాన్ని ఎంతగా తాము కోరుకుంటున్నదీ తెలపడానికీ వారు కౌగిలింతలను మార్గంగా చేసుకుంటారు.

కౌగిలింతలు నాలుగు (4)రకాలు:-
1. స్పృష్టకం - అంటే ఒకరి నొకరు స్పృశించడం.
2. విద్ధకం - ఒకరినొకరు గట్టిగా నొక్కుకోవడం.
3. ఉద్ఘృష్టం- ఒకరినొకరు గట్టిగా రాచుకోవడం.
4. పీడితకం - గాఢంగా ఒత్తుకోవడం.

యువతీ యువకుల నడుమ ప్రేమ అంకురించడంలో వున్న వివిధ దశలివి. 

---------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------

 పరుండిన భంగిమలోని కౌగిలింతలేమిటో చూద్దాం :: వాత్స్యాయన కామశాస్త్రం Part 8

1. స్త్రీ పురుషులు ఒకరి తొడతో మరొకరి తొడను చుట్టేసి, చేతులతో పెనవేసుకుని శయనించే భంగిమను తిల తండులకం అని అంటారు.

2. మోహ పరవశులై విపరీతమైన అనురాగంతో బలంగా కౌగిలించుకోవడాన్ని క్షీర జలకం అని అంటారు.

కూర్చున్న లేదా పరుండిన భంగిమలలో ఏ స్థితిలోనైనా ఈ కౌగిలింతలో సుఖం అనుభవించవచ్చునని వాత్స్యాయనుడు అంటారు. ఈ భంగిమలో స్త్రీ పురుషులు పాలు, నీరు కలిసినట్టు కలిసిపోతారు. అందుకే దీనిని క్షీర జలకం అని అంటారు.


3. క్షీర జలకం భంగిమలోనే పురుషుడు తన తొడలతో స్త్రీ ఒక తొడను కాని, రెండు తొడలను కాని చుట్టివేసి స్త్రీ తొడలను బలంగా ఒత్తితే దానిని ఊరూప గుహనం అని అంటారు.

4. పురుషుడు కూర్చున్నా,నిలుచున్నా లేదా శయనించి ఉన్న సమయాలలో స్త్రీ పురుషుని వక్ష స్థలంపై తన వక్షోజాల భారం మోపి అతనిలో కామోద్రేకం రేపుతూ చేతులతో మాత్రం కౌగిలించుకోని స్థితిని స్థనాలింగనం అని అంటారు.
అంటే స్త్రీ తన స్థనాలతో పురుషుని కౌగిలించుకోవడం అన్న మాట. ఈ భంగిమ పురుషునిలో తీవ్రమైన మోహావేశాన్ని కలిగిస్తుంది. ఎంతటి జడునిలోనైనా చలనాన్ని కలిగించి తీరుతుంది.


5. స్త్రీ పురుషులు గాఢంగా కౌగిలించుకున్న స్థితిలో ఒకరి మొహంలో ఒకరు మొహం పెట్టి, ఒకరి కన్నులలో మరొకరు చూసుకుంటూ, ఒకరి ఫాల భాగం మరొకరి ఫాల భాగం తాకుతూ ఉండే స్థితిని లలాటికం అని అంటారు.


సాధారణంగా శృంగార క్రీడ ముగిసిన తర్వాత ఇటువంటి భంగిమలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి.

ఇవే కాకుండా స్త్రీ పురుషుల ఇష్టాయిష్టాలను బట్టి ఎన్నో రకాల ఆలింగనాలు జరగవచ్చు. ఏ కౌగిలింత అయినా స్త్రీ పురుషులను శృంగార క్రీడకు దోహదం కలిగించేవిగా ఉండాలి.

ఏదేమైనా స్త్రీ శరీర తత్వాన్ని గ్రహించి పురుషుడు రతి సాగించాలి. అప్పుడే ఇద్దరికీ సుఖం కలుగుతుంది.
సాధారణ స్త్రీ శరీర తత్వం మెల్లగా పారే సెలయేరు వంటిదని, పురుషుని తీరు ఎగసి పడే సముద్రం వంటిదని వాత్స్యాయనుడు వివరిస్తాడు.

స్త్రీలో వాంఛ నెమ్మదిగా కలిగి రసోద్రేకం కలగడానికి కొంత సమయం పడుతుంది. పురుషుని స్థితి ఆ విధంగా ఉండదు. స్త్రీ తత్వాన్ని పురుషుడు గ్రహించి, ఆమెకు అనుకూలంగా మసలాలి.

స్త్రీలో స్పర్శ, కౌగిలింతలు, చుంబనాలు ఆమెలోని కోర్కెను ద్విగుణీకృతం చేస్తాయి, అయితే పురుషునికి సంభోగంతోనే తృప్తి కలిగి శృంగార క్రియ ముగిసినట్టవుతుంది.
పురుషుని తీరును బట్టి స్త్రీ సంభోగ క్రియలో ఒకేసారి కాకుండా ఎక్కువ సార్లు కూడా భావ ప్రాప్త్రి పొందగలుగుతుంది.
పురుషుడు రతి ముగించినప్పుడు ఆమెలో కామోద్రేకం తగ్గుముఖం పడుతుంది. ఇది గ్రహిస్తే స్త్రీని శృంగారంలో ఎక్కువగా తృప్తి పరచవచ్చని వాత్స్యాయనుడు అంటారు.


స్త్రీని బాహ్య ప్రేరణలతోనే పరవశురాలిని చేయవచ్చు. బాహ్య ప్రేరణలోని కౌగిలింతల గురించి తెలుసుకున్నారు కదా.

----------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------

 శృంగారానికి స్త్రీని సన్నధం చేయడం ఎలా :: వాత్స్యాయన కామశాస్త్రం Part 9

శృంగార క్రీడకు కౌగిలింత తొలిమెట్టయితే, చుంబనం రెండవ మెట్టులాంటిదని వాత్స్యాయనుడు చెప్పాడు. అంటే ముందుగా స్త్రీని కౌగిలించుకుని, ఆ తర్వాత ఆమెని గాఢంగా హత్తుకుంటూ ముద్దు పెట్టుకోవాలి. అయితే దీనికి ఒక చిన్న మినహాయింపు వంటిది కూడా శాస్త్రకారులిచ్చారు.

అదేమిటంటే ఎక్కువసేపు సంభోగం జరపగల పురుషుడు స్త్రీని ముందు ముద్దులతో ముంచెత్తి ఆ తర్వాత ఆమెను కౌగిలించుకోవాలని పేర్కొన్నాడు. నిజానికి శృంగార క్రీడలో చుంబనానికి సంబంధించి అయిదు విభాగాలున్నాయని (చుంబన పంచకo ) వాత్స్యాయనుడు వివరించాడు.
అవేమిటంటే......
1. చుంబనం,
2. ఆలింగనం,
3. దంతక్షతం,
4. నఖక్షతం,
5. ప్రణయ తాడనం.

ఇందులో చుంబనమంటే ముద్దు.
ఆలింగనం అంటే కౌగిలింత.
దంతక్షతం అంటే చిన్నగా కొరకటం.
నఖక్షతం అంటే గోళ్లతో చిన్నగా రక్కటం, గిచ్చటం.
ప్రణయ తాడనం అంటే శృంగారోద్రేకంలో చిన్న చిన్న దెబ్బలు కొట్టటం.


దంతక్షతం, నఖక్షతం, ప్రణయతాడనం వంటివి సాధారణంగా పురుషులకే పరిమితమని చెబుతుంటారు. రతిక్రీడలో దాదాపు ప్రతి పురుషుడూ ఈ చుంబన పంచకాన్ని ప్రయోగించి తీరుతాడు. అయితే ఎక్కువు సేపు రతి చేయలేని వారు వీటిని ముందే చేస్తారని చెబుతారు.

కొత్తగా పరిచయమైన స్త్రీతో రతి క్రీడ సాగించేదుకు సన్నద్ధులవుతుంటే ముందుగా ఆమె ఇష్టాయిష్టాలు గ్రహించి, ఒక క్రమ పద్ధతిలో చుంబన పంచకాన్ని ప్రయోగించాలి.
తొందరపడి వీటినన్నింటిని ఒకేసారి ప్రయోగించరాదు. అలా చేసిసట్లయితే స్త్రీ బెదిరిపోతుందని, రసభంగమవుతుందని శాస్త్రకారులు హెచ్చరించారు. నిదానంగా స్త్రీని పూర్తిగా ఆయత్తురాలిని చేసిఅప్పుడు వీటిని ప్రయోగించాలని సూచించారు.

అయితే ఇక్కడ వాత్స్యాయనుడు రతి క్రీడకు సంబంధించి ఒక రహస్యాన్ని వివరించాడు. స్త్రీకి రతి ప్రారంభంలోకన్నా మధ్యకాలంలో ప్రేమానురాగాలు ఎక్కువగా వుంటాయి. కాబట్టి ఆ సమయంలో ముద్దులు, క్షతాలు ఎక్కువగా ప్రయోగించాలని ఆయన చెబుతున్నాడు.

ఆ విధంగా ప్రయోగిస్తుంటేనే స్త్రీకి ఎక్కువ ఆనందం కలుగుతుంది. కొత్తగా పరిచయమైన స్త్రీతో తొలుత కొద్దికాలం ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో ప్రవర్తించాలి. పరిచయం పెరిగి ఒకరి ఇష్టాయిష్టాలను ఒకరు గ్రహించిన తర్వాత ఎటువంటి నియమాలూ పాటించవలసిన పనిలేదని శాస్త్రకారులు వివరిస్తున్నారు.
అయితే ఇదంతా ఎందుకంటే స్త్రీకి పురుషుని ఒక విధమైన నమ్మకం, ప్రేమ పుట్టించి, తనకు పూర్తిగా అనుకూలంగా చేసుకోవడానికి, రతి క్రీడ అంటే ఆమెకు మక్కువ పెంచటానికి.
కొందరు పురుషులు స్త్రీ పట్ల ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలోనూ ప్రేమ పూర్వకంగా నూ ప్రవర్తించరు. వారు దూకుడుగా, ఉన్మాదుల వలె రతి సాగిస్తారు. దీని వల్ల స్త్రీ బెదిరిపోతుంది. పురుషునిపై ఏహ్యభావాన్ని పెంచుకుని శృంగారం పట్ల విముఖురాలైపోతుంది. కాబట్టి ఈ సమయంలో స్త్రీతో వీలైనంత సున్నితంగా వ్యవహరించాలే తప్పితే మొరటుగా ప్రవర్తించరాదు.

సున్నితంగా వ్యవహరిస్తూ, నిదానంగా , ఎక్కువసేపు రతి సాగించే వానికి స్త్రీ వశమవుతుంది. అలా సున్నితంతా ప్రవర్తిస్తేనే స్త్రీకి రతిలో ఆనందం చేకూరుతుంది. స్త్రీ శరీరతత్త్వాన్ని, అభిరుచులను గుర్తించే శృంగారం కొనసాగిచాలి.
స్తీలందరి తత్వం, అభిరుచులు ఒకే విధంగా ఉండాలని ఏమీ లేదు. ఎక్కువమందికి పైన చెప్పిన సూత్రాలు వర్తిస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
శృంగారంలో చుంబనానికి ఎంత ప్రాధాన్యం ఉందో, చుంబనానికి తగిన ప్రదేశాన్ని గుర్తించి అక్కడే ముద్దాడడానికీ అంతే ప్రాధాన్యం ఉంది.

-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------


యువతీ యువకుల నడుమ ప్రేమ అంకురించడంలో వున్న వివిధ దశలు ::వాత్స్యాయన కామశాస్త్రం Part 10

యువతీ యువకుల నడుమ ప్రేమ అంకురించడంలో వున్న వివిధ దశలను 8 వ భాగం చివరలో తెలుసుకున్నాం. దానిని కొనసాగిస్తూ ప్రియురాలు ప్రియుడు మద్య సాగే కౌగిలింతలు గురించి వివరంగా తెలుసుకుందాం.

స్పృష్టకం:
స్త్రీ తనకు సమీపంలో ఉన్నప్పుడు కావాలని తగిలినట్టు కనపడకుండా పురుషుడు ఆమె శరీరాన్ని తాకాలి. ఆమెకు స్పర్శ సుఖాన్ని అందించాలి. ఇలా చేయడాన్ని స్పృష్టకం అంటారు.

దీనివల్ల స్త్రీలో పురుషుని పట్ల ప్రేమ అంకురించడానికి అవకాశం ఉంది. ఈ స్పర్శ వల్ల ఇరువురి శరీరాల పులకరించి ప్రేమ మరింత పెంపొందుతుందని వాత్స్యాయనుడు వివరిస్తున్నాడు.

విద్ధకం:
ఏకాంత ప్రదేశంలో ప్రియుడు ఏదైనా పనిలో ఉన్నప్పుడు అతనిని సమీపించిన ప్రియురాలు అతనికి సాయము చేసే నెపం మీద కాని, మరే ఇతర నెపం మీద కాని తన వక్షోజాలు అతనికి తగిలేలా చేయాలి. అప్పుడు ప్రియుడు కూడా సమయోచితంగా స్పదించి ఆమెకు తగిన రీతిలో తన చేష్టల ద్వారా జవాబివ్వాలి. ఇలా చేయడాన్ని విద్ధకం అంటారు.

ఇవి ప్రేయసీ ప్రియులు కొత్తలో కాని, ఎదుటివారికి తన ప్రేమను తెలియచేసేవి కాని అయి వుంటాయని వాత్స్యాయనుడు చెప్పాడు. అంటే స్త్రీ పురుషులు అపరిచితులైనప్పుడు ఈ ఆలింగనాల ప్రేమను వృద్ధి చేయడానికి పనికివస్తాయి. ప్రేయసీ ప్రియుల మధ్య కొద్దికాలంగా ప్రేమాయణం సాగుతూ వారిరువురూ బాగా పరిచయం వున్నవారైనప్పుడు గాఢాలింగనాలు కోరుకుంటుంటారు.

అయితే అపరిచితులుగా వున్న స్త్రీ పురుషులు ప్రేయసీ ప్రియులుగా మారే క్రమంలో సాగే కౌగిలింతలు కొని వున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

స్పుటకం:
స్త్రీని ఒక గోడకు కాని స్తంభానికి ఆనించి ఆమెను కౌగిలించుకుంటే దానిని స్పుటకం అంటారు. స్పుటకాన్నే మరింత బలంగా, ఎకువ ఒత్తిడితో చేస్తే దానిని పీడితకమ్* అని అంటారు.

ప్రేయసీ ప్రియుల మధ్య పరిచయం పెరిగి పరస్పరం సంభోగంపై ఆసక్తి పెంచుకుంటున్న క్రమంలోని ఆలింగనాలు వేరేవిధంగా వుంటాయి.
ఈ కౌగిలింతలలో మొదటి రెండూ ప్రేయసి మాత్రమే ఆచరిస్తుంది. చివరి రెండింటిని ప్రేయసీ ప్రియులెవరైనా ఆచరించవచ్చు. అవేమిటంటే.....


లతావేష్టికతమ్:-
చెట్టుకు తీగలు చుట్టుకున్నట్టుగా స్త్రీ పురుషుని చుట్టివేసి, అతని ముఖాన్ని ముద్దాడాలన్న కుతూహలంతో ముఖాన్ని పైకెత్తి, ఎగబాకుతూ అతని ముఖాన్ని కిందకి వంచి, తన వక్షోజాలతో బలంగా హత్తుకుంటూ, అతని ముఖంలోకి తదేకంగా చూడడాన్ని లతావేష్టికతమ్* అని అంటారని వాత్స్యాయనుడు వివరిస్తున్నాడు.


వృక్షాదిరూఢకం:
నిలుచుని ఉన్న భంగిమలో ప్రేయసి తన కాలితో ప్రియుని కాలిని తొక్కిపెట్టి ఒక కాలితో అతని తొడ మీదుగా నడుమును చుట్టివేసి, రెండవ కాలి మీద నిలిచి ఒకచేతితో అతనిని చుట్టివేసి కౌగిలించుకోవాలి. రెండవచేతితో అతని మెడను కిందికి దించి, పైకి చెట్టు ఎక్కుతున్న రీతిలో ఎగబాకుతూ ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని వృక్షాదిరూఢకం అని అంటారు.

ఇవి రెండూ నిలుచుని ఉన్న భంగిమలో చేసేవి. పరుండిన భంగిమలో చేసే ఆలింగనాలు మరికొన్ని ఉన్నాయి. అవి.....
తిల తిండులకమ్*, క్షీర జలకం.


ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఇంతకు ముందు వివరించిన రెండు ఆలింగనాలూ సంభోగానికి సమాయత్తం చేసేవి కాగా, ఇప్పుడు వివరింనబోయేవి సంభోగానికి ముందు ఉద్రేకంతో చేసేవి. అవేమిటో తరువాయి భాగంలో తెలుసుకుందాం.
-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------
 ముద్దులలో పందాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 11

ముద్దులకు సంబధించి అనేక విషయాలు వాత్స్యాయనుడు వివరించారు.
వాటిలో ఒకటి ముద్దులలో పందాలు. స్త్రీ పురుషులు కేవలం మదనోద్రేకంతోనే కాకుండా ప్రేమానురాగాలు పెంపొందిన తర్వాత ఉత్సాహంతో వేసుకునే పందాలివని ఆయన తెలిపాడు.

ముద్దులలో వేసుకునే పందాలలో ముఖ్యమైనది ప్రేయసీ ప్రియులు ఒకరి పెదవిని ఒకరు గ్రహించాలనే తాపత్రయంతో పెనుగులాడడం.
ఇక్కడ మరొక అంశమేమిటంటే ఒకరు ముద్దుకోసం పాకులాడుతుంటే మరొకరు దానిని దక్కనివ్వకుండా చేయడం.


ముద్దులకు సంబంధించిన ఈ పందాలను రెండు రకాలుగా వర్గీకరించాడు వాత్స్యాయనుడు. వాటిలో ఒకటి మోసపు పందెం, మోసం లేని పందెం.

ప్రేయసీ ప్రియులు ఎదుటివారి పెదవిని తామే ముందుగా అందుకోవాలని పెనులాగుడూ పందెం సాగిస్తారు. ఇందులో ఎటువంటి మోసాలకూ తావులేదు కాబట్టి ఇది మోసం లేని పందెమే.

ఈ పందెంలో సాధారణంగా పురుషుడే నెగ్గుతాడు. అయితే కొన్ని సందర్భాల్లో పురుషుడు ఓడినట్టు నటిస్తాడు.
ఓడిపోయేందుకే ప్రయత్నిస్తాడు. ఆ పందెంలో స్త్రీ ముందుగా పురుషుని పెదవిని అందుకుంటుంది. ఇక్కడ పురుషుడు కావాలని ఓడిపోతున్నాడు కనుక దీనిని మోసపు పందెం అని అంటారు.

మోసపు పందాలు ప్రణయ కలహానికి దారి తీస్తుంటాయి. ఇటువంటి పందెంలో స్త్రీ ఓడిపోయినట్టయితే పురుషునితో కయ్యానికి దిగుతుంది, నటిస్తుంది, వగలుపోతుంది, హొయలు చూపుతుంది. ఈసారైతే తనే నెగ్గుతానని పురుషుడిని రెచ్చగొట్టి తిరిగి పందేనికి దింపుతుంది.

మోసపు పందేలు స్త్రీ బాగా రక్తి గట్టించగలదు. పురుషుడు ఏమరుపాటుగా వున్నప్పుడు హఠాత్తుగా అతనిపైబడి ముద్దుల వర్షం కురిపిస్తూ అతని పెదవిని దొరకబుచ్చుకుంటుంది. అతని పెదవులను తన పెదవులతో, పళ్లతో బంధించి అతనిని తన చేతుల మధ్య కట్టి పడేయాలి. ఇది మోసపు పందెంలోని ఒక విధం..

మోసపు పందేలలో ఎక్కువసార్లు స్త్రీ నెగ్గుతుంది. కొన్ని సార్లు పురుషుడు నెగ్గవచ్చు. ఎవరు నెగ్గినా ఈ పందేనికి కొనసాగింపుగా ఎదుటి వారిని సవాలు చేస్తూ మరొక పందేనికి దారితీసే విధంగా ప్రవర్తించాలని వాత్స్యాయనుడు సూచించాడు.
ఇటువంటి పందేలే స్త్రీ పురుషులలో అనురాగాన్ని పెంపొందిస్తాయని ఆయన వివరించాడు.

యవ్వనం తొలి దశలో వున్న యువకుడు స్త్రీని ముద్దాండేందుకు ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. స్త్రీ రెండు పెదవులు ముడిచి ఉన్నప్పుడు తను కూడా రెండు పెదవులూ ముడిచి స్త్రీని ముద్దాడాలి దీనిని సంపుటకం అని అంటారు.

పురుషుడు శారీరకంగా స్త్రీ కంటే బలవంతుడు కాబట్టి తన బలంతో స్త్రీని తన చేతులలోకి లాక్కుని ఆమెను వశం చేసుకుని తన పెదవులతో ఆమె పెదవులను బంధించాలి. ఆమెను గేలి చేయాలి. ఉడుకుమోత్తనంతో స్త్రీ అక్కడి నుండి వెళ్లి పోయేందుకు ప్రయత్నిస్తే ఆమె యత్నాన్ని భగ్నం చేయాలి. కవ్వించాలి. బెదిరించాలి. పోట్లాడాలి. ఆమెను వివశురాలిని చేసేందుకు తిరిగి తన కౌగిలిలోకి లాక్కోవాలి.

ఇవన్నీ చేసేందుకు ఒక పరిమితి ఉంది. ఈ పందేలు స్త్రీ పురుషుల అనురాగాన్ని వృద్ధి పరచేవిగా వుండాలి. ఎక్కువసేపు రతి చేయగల వారు మాత్రమే ఇటువంటి పందేలకు దిగాలి.


మోసపు పందేలలో పురుషుడు నెగ్గితే అతడు ప్రవర్తించవలసిన పద్ధతి స్థూలంగా ఇదీ. మరి స్త్రీ నెగ్గితేనో?

మోసపుపందేలలో స్త్రీ నెగ్గితే ఆమె ఎలా ప్రవర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మోసపు పందేనికి దిగుతున్నప్పుడే స్త్రీ పురుషుడిని కొద్దిగా నమ్మించాలి. అతడినే గెలిపిస్తున్నట్టుగా ప్రవర్తించాలి. పురుషుడు ఏమరుపాటుగా ఉన్నప్పుడు, సమయమెరిగి హఠాత్తుగా అతని పెదవిని గ్రహించాలి. ముందుగా అతని పెదవులను తన పెదవులతో బంధించాలి. తర్వాత పళ్ళతో బంధించాలి. మెల్లగా అతనిని వివశుడిని చేసి పందెపు మాట మరిచిపోయే విధంగా రెచ్చగొడుతూ శృంగార క్రీడకు సన్నద్ధుడిని చేయాలి.


ఆ దశలో పందెపు మాట గుర్తు వచ్చినట్టు అతని నుంచి విడివడిపోయి పందెంలో ఓడిపోయారంటూ ప్రియుడిని గేలి చేయాలి. అతని మగతనాన్ని శంకిస్తూ మాటలతో రెచ్చగొట్టాలి. ఇకెప్పుడూ ఇటువంటి పందేలు తనతో ఆడవద్దని విజయం తనదే అవుతుందని బెదిరిస్తూ, చేవవుంటే మరల పందేనికి దిగమని ఆహ్వానించాలి. క్రీగంట చూస్తూ, మనోహరంగా నవ్వుతూ, కవ్విస్తూ ప్రియుడి మనసెరిగి మాట్లాడాలి. ఇలా చేస్తే మోసపు పందేలలో ప్రేయసీ ప్రియులిరువురికీ ఎక్కువ ఆనందం కలుగుతుంది.

ముద్దులకు సంబంధించి మోసపు పందేలలో స్త్రీ పురుషులు ఈ విధంగా ప్రవర్తిస్తూ, సమయోచితంగా వ్యవహరిస్తూ ఉంటే వారిరువురి మధ్య అనురాగం పెంపొందుతుందని వాత్స్యాయనుడు వివరించారు.


స్త్రీ పురుషులు ముద్దాడుకొనవలసిన తీరులనూ వాటికి వాత్స్యాయనుడు ఇచ్చిన పేర్లనూ గతంలో కొన్ని చూశాం. ఇప్పుడు మరికొన్ని చూడండి.

నూతనంగా యవ్వనంలో ప్రవేశించిన యువకుడు స్త్రీని ముద్దాడే తీరు గురించి చెబుతూ పురుషుడు రెండు పెదవులు ముడిచి, స్త్రీ కూడా రెండు పెదవులు ముడిచి ఉన్నప్పుడు ఆ పెదవులను తన నోటిలోకి తీసుకోవాలి. దీనినే సంపుటకం అని అంటారు.

పెదవులను ముద్దాడే పద్ధతులలో అంతర్ముఖ చుంబనం అని మరొక పద్ధతి కూడా ఉంది. దాని గురించి వాత్స్యాయనుడు ఏం చెబుతున్నాడో ఇప్పుడు చూద్దాం. స్త్రీ పురుషుల్లో ఎవరి పెదవులు ఎవరి నోట్లోకి ప్రవేశిస్తాయో వారు ఎదుటివారి చిగుళ్ళను తన నాలుకతో తాకాలి.

ఇలా చేస్తున్నప్పుడు స్త్రీ పురుషులిరువురూ తమ తమ నాలుకలను పొడుగ్గా సాచి లేదా, ఒకరి నాలుకలతో మరొకరి నాలుకను స్పృశిస్తూ కొనసాగే ముద్దును జిహ్వా యుద్ధం అని అంటారు. జిహ్వా యుద్ధం గురించి ముద్దులలో రకాల గురించి తెలుసుకునే ముందు వీటి గురించి వాత్స్యాయనుడు వీటి వర్గీకరణ ఎలా చేశారన్నది చూద్దాం.

వాత్స్యాయనుడు కేవలం శృంగార శాస్త్రానికి సంబంధించిన మహోద్రంథాన్ని రచించిన మహా మునే కాదు స్త్రీ పురుషుల మనసత్వాలనూ, శారీరక తత్వాలను ఏ సమయంలో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారో క్షుణ్ణంగా తెలుసుకున్న మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న శాస్త్రవేత్త అని మనం తెలుసుకోవాలి.

భిన్న స్వభావాలు కలిగిన స్త్రీ పురుషులను ఎంతో సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఆయనీ గ్రంథ రచనకు పూనుకున్నారేమో అని అనిపించక మానదు. లేకుంటే ఇన్ని విషయాలు ఇంత సుబోధకంగా వివరించడం ఎవరి వల్లా కాదేమో కదూ! 
-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------
 ముద్దులలో మరికొన్ని మరియు నఖ, దంత క్షతాలు ప్రాధాన్యత :: వాత్స్యాయన కామశాస్త్రం Part 12

ఇప్పటి వరకు వాత్సాయనుడు చెప్పిన అనేక విషయాలు గురించి తెలుసుకున్నాము. గత బాగంలో శృంగారంలో ముద్దులకి ఉన్న ప్రాధాన్యత వాటితో శృంగార జీవితాన్ని ఎంత రసవత్తరంగా మార్చు కోవచ్చో తెలుసుకున్నాం.

ఈ బాగంలో ముద్దులలోని మరికొన్ని రకాలు తెలుసుకుందాం. ప్రియుడు ప్రియురాలిని, ప్రియురాలు ప్రియుడిని వారికి తెలియని సమయంలో ముద్దాడటాన్ని రకరకాలుగా వాత్స్యాయనుడు వర్గీకరించారు.

వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూడండి.

రాగ దీపం: రాత్రివేళ ప్రియుడు నిద్రిస్తున్న సమయంలో అతనికి తెలియకుండా ప్రియురాలు తనకిష్టం వచ్చిన రీతిలో అతడిని ముద్దాడితే దానిని రాగదీపం అని అంటారు.

చలితకం: ప్రియుడు ప్రణయ కలహంలో మునిగిన సమయంలో కాని, సంగీతం ఇతర వ్యాపకాల్లో మునిగిన సమయంలో కాని, లేదా పరాకుగా వున్న సమయంలో ప్రియురాలు అతడిని ముద్దాడితే దానిని చలితకం అంటారు.

ప్రాతిబోధకం: అర్ధరాత్రి ప్రియురాలు ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో ప్రియుడు అమెను ముద్దాడితే దానిని ప్రాతిబోధకం అని అంటారు. నిద్రిస్తున్న ప్రియురాలిని నిద్ర నుంచి మేల్కొల్పడమే దీని లక్ష్యం. నిద్ర నటిస్తున్న ప్రియురాలిని ప్రియుడు ముద్దాడితే దానిని ప్రాతిబోధక చుంబనం అని అంటారు.
ఇక్కడ తేడా అల్లా ఏమిటంటే ప్రియుడిని పరీక్షిద్దామనే ఉద్దేశంతో ప్రియురాలు కపట నిద్ర నటిస్తుంటుంది. అప్పుడామెను ప్రియుడు ముద్దాడాలి. అప్పుడది ప్రాతిబోధక చుంబనమవుతుంది.


ఛాయా చుంబనం: దీపపు కాంతి వలన గోడ లేదా మరే ఇతర ప్రదేశం మీదనైనా ఏర్పడిన ప్రియురాలి నీడను, అద్దంలో ఏర్పడిన ప్రియురాలి ప్రతిబింబాన్ని ప్రియుడు ముద్దాడితే దానిని ఛాయా చుంబనం అని అంటారు.

అంగుళి చుంబనం: ఏదైనా ప్రదర్శన జరుగుతున్నప్పుడు జనం మధ్యలో కూర్చున్న ప్రియురాలిని కేవలం ఆమెకు మాత్రమే తెలిసే విధంగా, ఇతరులకు అనుమానం రాకుండా ఆమె చేతి వేళ్ళనో, కాలివేళ్ళనో ముద్దాడడాన్ని అంగుళి చుంబనం అని అంటారు.


అభియోగాలు-పాదాంగుష్ట చుంబనాదులు: కొత్తగా పరిచయమై, ప్రేమ అంకురిస్తున్న సమయంలో ప్రియురాలు ప్రియునిపై కురిపించే ముద్దులివి. పురుషుని పాదాలు కాని, కాలి వేళ్ళు కాని ఒత్తుతూ నిద్ర ముంచుకు వస్తున్నదాని వలే నటిస్తూ అతని తొడలపై వాలిపోయి మెల్లగా తొడలపై చుంబించడాన్ని ఊరు చుంబనం అని పిలిస్తారు.

తొడలపై కాక కాలి వేళ్ళను ముద్దాడితే దానిని పాదాంగుష్ట చుంబనమని అంటారు.

పరిచయం కలిసి, మాటలు పెరిగిన స్త్రీపైనే అభియోగాలు ప్రయోగించవలసి ఉంటుందని వాత్స్యాయనుడు పేర్కొన్నారు
ముద్దుల గురించి, ప్రేయసీ ప్రియులు ఎప్పుడెప్పుడు ఎటువంటి ముద్దులు ఎదుటివారి మీద ప్రయోగించవలసి ఉంటుందీ అనే విషయాలు తెలుసుకున్నారు కదా! ముద్దుల గురించిన మరికొన్ని సంగతులు సందర్భానుసారం తెలుసుకుందాం.


ప్రస్తుతం రతిక్రీడలో ముఖ్యమైన చేష్టగా వాత్స్యాయనుడు పేర్కొన్న నఖ క్షతాలు, దంత క్షతాల గురించి తెలుసుకుందాం


నఖ క్షతం:
నఖ క్షతం అంటే గొటితో సున్నితంగా గిచ్చడం, దంత క్షతం అంటే రక్కడం ప్రియుడు మోహావేశంలో మోటుగా ఇవి ప్రయోగించినా ప్రేయసికి ఇవి సుఖాన్నే ఇస్తాయని వాత్స్యాయనుడు చెబుతాడు.

అయితే మరీ మోటుతనం కూడదని మాత్రం హెచ్చరిస్తాడు.నఖ దంత క్షతాలు ప్రేయసీ ప్రియుల మధ్య అనురాగాన్ని వృద్ధి చేస్తాయని ఆయన వివరిస్తాడు.
నఖ, దంత క్షతాలము ప్రయోగించడానికి స్త్రీ శరీరంలో కొన్ని ప్రత్యేక ప్రదేశాలు కూడా ఉంటాయి. వాటిని ఎప్పుడెప్పుడు?, ఎక్కడెక్కడ ప్రయోగించాలో కూడా వివరంగా చెప్పారు వాత్స్యాయనుడు.


నఖ, దంత క్షతాల్లో రెండు రకాలున్నాయి. అవి ఏమిటంటే ఏదైనా ఒక వస్తువు రూపాన్ని అనుకరిస్తూ చేసేవి. అలాంటిదేమీ లేకుండా కేవలం మోహావేశంతో చేసేవి. వస్తువు రూపాన్ని అనుకరిస్తూ చేసే క్షతాలను రూపవత్తులని, నిర్దిష్ట ఆకారం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసే క్షతాలను అరూపవత్తులని అంటారు.

అయితే మరికొందరు ఇటువంటి వర్గీకరణ విషయంలో వాత్స్యాయనుడితో విభేదిస్తారు. వారి వాదం ఏమిటంటే శృంగారానికి దిగిన తర్వాత మోహావేశంలో పురుషులు ఉద్రేకంగా ఉంటారు. అందువల్ల వారు ఇటువంటివి సాధారణంగా పట్టించుకోరు. కాబట్టి ఇటువంటి వర్గీకరణ అవసరం లేదంటారు వారు.

సరే... వారి వాదనని అలా ఉంచితే వాత్స్యాయనుడు ఏమంటున్నాడో చూద్దాం.

మందవేగులు, మధ్యవేగులు నఖ, దంత క్షతాలు ప్రయోగించకూడదు. అదేవిధంగా ఎప్పుడు పడితే అప్పుడు నఖ, దంత క్షతాలు ప్రయోగించకూడదు.


అయితే ఎప్పుడు ప్రయోగించాలి? దీనికి కూడా వాత్స్యాయనుడు సంపూర్తి వివరణ ఇచ్చారు.

ప్రియురాలిని చాలాకాలం తర్వాత కలుసుకున్నప్పుడూ.
ప్రియురాలిని ప్రసన్నం చేసుకోవడానికి.
ప్రేయసిని విడిచి దేశాంతరం వెళ్ళేప్పుడు కాని.
శృంగారం క్రీడలో ప్రేయసికి మరింత ఆనందాన్ని కలిగించడానికి.
ఈ సమయాలలో నఖ, దంత క్షతాలు ప్రయోగించవచ్చట.


ముందుగా నఖ క్షతాలనే ప్రేయసిపై ప్రయోగించాలి. ఆ తర్వాతే దంత క్షతాలు ప్రయోగించాలి. దంత క్షతాలు కూడా మృదువుగానే ఉండాలి.

ఇక ఎక్కడెక్కడ నఖ క్షతాలు ప్రయోగించాలంటే...
చంకలు, స్తనాలు, కంఠ పక్క ప్రదేశాలు, పిరుదులు, తొడలు.


ఈ ప్రదేశాలలో నఖ క్షతాలు ప్రయోగించడం వల్ల స్త్రీ, పురుషులకు ఎంతో హాయిగా ఉంటుంది. 
-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------
 నఖ క్షతాలు చేయడానికి గల నియమాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 13

నఖ క్షతాలు చేయడానికి కొన్ని నియమాలుంటాయంటారు వాత్స్యాయనుడు. అవేమిటంటే
నఖక్షతాలకు కేవలం ఎడమచేతి గోళ్ళనే ఉపయోగించాలి.
ఆ గోళ్ళు మరీ పొడవుగా కాక కొద్దిగా పొడవుండి బాగా కొనదేలి ఉండాలి.
ఆరోగ్యమైన గోళ్ళు కలవారు మాత్రమే నఖ క్షతాలు ప్రయోగించాలి.
గోళ్ళలో మట్టి, మురికి చేరి ఉండరాదు. పిప్పిగోళ్ళు ఉండరాదు.
రతిలో ఎక్కువసేపు పాల్గొనే శక్తి కలవారు మాత్రమే నఖక్షతాలు ప్రయోగించాలి.

నఖ క్షతాలు చేసేవారు గోళ్ల విషయంలో పాటింవలసిన కనీస నియమాలివి.

కౌగిలింతలలోనూ ముద్దులలోనూ రకాలున్నట్టే నఖ క్షతాలలోనూ అవి చేసే తీరును అనుసరించి వాటిని రకరకాల పేర్లతో వర్ణించారు.


అచ్ఛురితకం: అయిదు వేళ్ల గోళ్లనూ మడిచి ఎటువంటి గాటు పడకుండా చెక్కిలి మీద మెల్లిగా గిచ్చితే దానిని అచ్ఛుతితకం అని అంటారు

అర్ధ చంద్రకం: కంఠానికి రెండు పక్కలా, వక్షోజాల వెనుక భాగంలో అర్ధ చంద్రాకృతిలో గాటు పడేలా క్షతం చేస్తే దానిని అర్ధ చంద్రకం అని అంటారు.

అచ్ఛురితకం ఉపయోగించే సందర్భాలు కూడా ఉంటాయి.

ప్రియురాలిని శృంగారానికి సమాయత్తం చేసే సందర్భంలో ముఖ్యంగా ప్రియురాలితో కొద్ది పరిచయం మాత్రమే ఉన్నప్పుడు, ఆమెతో సరస సల్లాపాలు సాగిస్తూ, తనపై ఆమెకు నమ్మకం, వ్యామోహం పెంచడానికి అచ్ఛురితకం చేయవచ్చంటారు వాత్స్యాయనుడు.

అచ్చురితకం వల్ల ప్రేయసికి మధురమైన భావం కలుగుతుంది. శరీరంలో పులకరింత కలిగి ప్రియినిపై అనురాగం జనిస్తుంది. అయితే కొద్దిపాటి పరిచయం ఉన్న స్త్రీలోనే ఇటువంటి లక్షణాలను ప్రస్ఫుటంగా చూడవచ్చు.

అచ్చురితకం, అర్థ చంద్రకంలను ఎదురెదురుగా ఉన్నప్పుడు చేస్తే అప్పుడు దానిని మండలం అని అంటారు. ఈ మూడు రకాల క్షతాలను స్త్రీల బొడ్డు, పిరుదులు, గజ్జల వద్ద ప్రయోగించాలి. దీనితో స్త్రీలో ఉద్రేకం కలిగి, వివశురాలై రతి క్రీడకు సన్నద్ధం అవుతుందని వాత్స్యాయనుడు చెబుతారు.


మయూర పదకం: చేతి బొటన వేలి గోటితో చను మొనల వద్ద గట్టిగా గంటు పడేలా క్షతం చేస్తే దానిని మయూర పదకం అని పిలుస్తారు. ఈ నఖ క్షతానికి అయిదు వేళ్ళ గోళ్లూ చూచుకానికి చుట్టుకుని, చూచుకానికి అభిముఖంగా ఉంటాయి.

సాధారణంగా చనుమొనల వద్ద ప్రియుడు కలిగించే కొద్దిపాటి స్పర్శకు కూడా స్త్రీ అమితంగా స్పందిస్తుంది. అటువంటిది మరి ఈ రకమైన నఖ క్షతానికి స్పందించకుండా ఉంటుందా? తప్పక స్పందిస్తుంది. దీనివల్ల స్త్రీకి అమితమైన సుఖం కలుగుతుంది. మయూర పదకానికి అనుబంధంగా సాగే నఖ క్షతాలు కూడా ఉంటాయి..

స్త్రీ పురుషులు తమ తమ ఇష్టాయిష్టాలను అనుసరించి, ఎదుటివారి అభిరుచులను కూడా గౌరవిస్తూ, పరస్పరానురాగంతో సాగే శృంగారం ఎప్పుడూ ఇద్దరికీ ఎనలేని ఆనందాన్నిస్తుంది. ఇటువంటి ఆనందాన్ని మరింత పెంపొందిస్తాయి ఈ నఖ క్షతాలు. ఎక్కువ సేపు రతి కేళి సాగించే వారు యథేచ్ఛగా నఖ క్షతాలు చేసుకోవచ్చు. ప్రేయసి దేహాన్ని తడుముతూ, చుంబిస్తూ అమెలో ఉద్రేకాన్ని పెంచే ప్రతీ చేష్ట చేసేప్పుడూ ఈ నఖ క్షతాలు చేయచ్చు.

మయూర పదకంకు అనుబంధంగా సాగే కొన్ని నఖ క్షతాలు ఉంటాయని అనుకున్నాం కదా! దానిలో మొదటిది శశప్లుతకం. మయూర పదకంలో వలే చేస్తూ అయిదు గోళ్లనూ ఒక్క చోటికి చేర్చి చేసే నఖ క్షతన్ని శశప్లుతకం అని అంటారు. ఇది కూడా స్థనాగ్రం మీద, అందునా చూచకం మీద నఖ క్షతం కాబట్టి దీనిని స్త్రీఎంతగానో ఇష్టపడుతుంది.


స్మరణీయకం: ప్రియుడు లేదా ప్రేయసి సుదూర ప్రాంతాలకు వెడుతూ తద్వారా వారికి సూదీర్ఘ కాలం వియోగం కలుగుతుందని భావిస్తున్నప్పుడు, ఆ వియోగం ఎక్కువ కాలం ఉండకూడదని ఆకాంక్షిస్తూ ప్రియుడు ప్రేయసి తొడ మీద చేసే నఖ క్షతాలను స్మరణీయకం అని అంటారు.

తక్కువ క్షతాలు చేస్తే ఎక్కువకాలం వియోగం కలుగనున్నదని, ఎక్కువ క్షతాలు చేస్తే తక్కువ కాలం వియోగం కలగనున్నదని చిహ్నంగా భావించమంటారు. అయితే అయిదారు మించకుండానే ఈ క్షతాలు చేయాలని వాత్స్యాయనుడు వివరించారు 
-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------
 దంత క్షతాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 14

స్త్రీల స్వభావాలలో భేదాలను అనుసరించి వివిధ రకాల జాతులకు చెందిన స్త్రీలపై ప్రయోగించదగిన వివిధ క్షతాలను వాత్స్యాయనుడు వివరించాడు.

వాటిలో రతి క్రీడపై మిక్కిలి ఆసక్తి చూపే స్త్రీ ఎక్కువగా ఉత్పల పత్రకం అనే నఖ క్షతాన్ని ఇష్ట పడుతుందని వాత్స్యాయనుడు చెబుతున్నాడు. స్త్రీ చనుమొనకు వెనుక భాగంలోనూ, కటి వద్ద గోరు కొనలతో మృదువుగా క్షతం చేయడాన్ని ఉత్పల పత్రకం అని అంటారు.

నఖ క్షతాలకు సంబంధించిన మరికొన్ని విశేషాలను సందర్భానుసారం తెలుసుకుందాం. ప్రస్తుతం రతి సమయంలో స్త్రీ, పురుషుల మధ్య అనురాగాన్ని పెంచే దంత క్షతాల గురించి తెలుసుకుందాం.

అసలు దంత క్షతాలు ఎన్ని రకాలో ముందుగా పరిశీలిద్దాం.

నఖ క్షతాలలో ఉన్నట్టే దంత క్షతాలలో కూడా రకాలు ఉన్నాయి. అవి:


1. గూఢకం: కేవలం గాటువంటిది పడి ఎక్కువ ఎర్రగా కందిపోకుండా పంటి మొనతో క్షతం చేయడాన్ని గూఢకం అంటారు. గూఢకం ఎక్కువగా వక్షోజాలు, చెక్కిలిపై చేయచ్చు. ఈ క్షతం వల్ల స్త్రీకి బాధ కలగదు. పైపెచ్చు ఒకవిధమైన హాయి కలుగుతుంది.

2. ఉచ్చూనకం: గూఢకాన్నే మరింత గట్టిగా చేస్తే అది ఉచ్చూనకం అవుతుంది. దీనిని కూడా గూఢకం ప్రయోగించే ప్రదేశాలలోనే ప్రయోగించవచ్చు. పెదవులపై కూడా ఉచ్చూనకం చేయవచ్చు....

3. బిందువు: పై పెదవి, కంఠానికి పక్క భాగంలో చిన్న గాటు పడేలా పురుషుడు తన పై పళ్ళలోని ముందరి రెండు పళ్ళు, కింది పెదవిలోని రెండు పళ్ళూ కలిపి క్షతం చేస్తే దానిని బిందువు అని అంటారు. బిందువునే పదే పదే ప్రయోగించగా స్త్రీకి అ ప్రాంతంలో ఎర్రగా కందిపోతే దానిని బిందు సిద్ధి అని అంటారు. బిందుసిద్ధిలో నాలుగు పళ్లూ ఒక్కసారిగా ప్రయోగించడం జరుగుతుంది.

4. బిందు మాల: .బిందు సిద్ధినే పదేపదే ప్రయోగిస్తే దానిని బిందుమాల అని అంటారు. అయితే కంఠం, కటి ప్రదేశము, నుదురు, తొడలు బిందు మాల ప్రయోగించదగ్గ ప్రదేశాలని వాత్స్యాయనుడి అభిప్రాయం.

5. ప్రవాళమణి: ప్రవాళమణి ఉచ్చూనకం వంటిదే. ప్రవాళమణిని స్త్రీ ఎడమ బుగ్గపై ప్రయోగించవలసి ఉంటుంది. ప్రవాళమణి వల్ల చిన్న గాటు పడుతుంది. ఇది స్త్రీ పురుషుల అనురాగానికి చిహ్నంగా ఎదుటివారికి గోచరిస్తుంటుంది. కాబట్టి ప్రవాళమణిని ప్రేయసి, ప్రియుల మధ్య తగదని, కేవలం వివాహ సంబంధం ఏర్పడిన వారి మధ్యనే ఇటువంటి దంతక్షతాలు చేయవచ్చని చెబుతారు.
..................................................
దీని పరమార్ధం ఒక్కటే. స్త్రీ గుట్టుగా సాగించే ప్రేమాయణాన్ని ఇది రట్టు చేస్తుంది కనుకనే వాత్స్యాయనుడు ఈ విధంగా హెచ్చరించి ఉంటాడని మనం అర్ధం చేసుకోవచ్చు. .

పై పళ్ళూ కింది పెదవి కాని, కింది పళ్ళూ పై పెదవిని ఉపయోగించి కానీ ప్రవాళమణిని చేయవచ్చు. ప్రవాళ మణిని స్త్రీకి కొద్దిగా బాధ కలిగేలా, గట్టిగా గాటు పడేలా ప్రయోగిస్తే అప్పుడు దానిని ప్రవాళమణి సిద్ధి అని అంటారు.
ఒకే ప్రదేశంలో పదేపదే ప్రయోగిస్తే అది ప్రవాళ మణి సిద్ధి, వేరు వేరు ప్రదేశాలలో ప్రయోగిస్తే అది మణిమాల అవుతాయి.

ఉచ్చునకం, బిందువు ప్రయోగించదగిన అన్ని ప్రదేశాలలో ప్రవాళమణిని ప్రయోగించవచ్చు.

స్త్రీ వక్షోజాలపై గుండ్రగా గాటు పడేలా క్షతం చేస్తే దానిని ఖండ్రాభ్రకం అని అంటారు. అయితే ఈ క్షతం వల్ల కొద్ది పళ్ళ గాట్లు స్ఫుటంగా, మరికొన్ని అస్పష్టంగా గాటు పడుతుంది. పురుషుడు ఎక్కువగా ఇష్టపడే క్షతం ఇది. దీనివల్లనే స్త్రీకి అపరిమితమైన ఆనందం కలుగుతుంది. మోహావేశం అధికమవుతుంది.

శృంగార ప్రారంభంలో, రతికి ముందుగా ఇటువంటివి ప్రయోగించడం చాలా అవసరమని వాత్స్యాయనుడు చెబుతారు. సరస సల్లాపాలలో భాగంగా సాగించే ఈ దంత క్షతం పురుషునిపై ఆ స్త్రీకి అనురాగాన్ని పెంచుతుంది.


ఖండ్రాభ్రకం ప్రయోగించడం పురుషునికి చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇష్టపడతాడు. స్త్రీకి సుఖాన్ని ఇస్తుంది. మరికేం కావలి? అందుకే దంత క్షతాలలో దీనినే ఉత్తమమైనదని చెబుతారు. 

-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------

 రతి క్రీడ ప్రారంభ సమయంలో స్త్రీ పట్ల ఏవిధంగా ప్రవర్తించాలి? :: వాత్స్యాయన కామశాస్త్రం Part 15

స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఎలా అంకురింస్తుంది. దీనికి ఆధునిక శాస్త్రాలు చాలా రకాల వివరణలు ఇస్తుంటాయి.

వాటిల్లో ముఖ్యమైంది ఏమంటే ప్రతి పురుషుని మనస్సులోనూ అంతర్లీనంగా తాను కోరుకుంటున్న స్త్రీకి ఏయే లక్షణాలు ఉండాలో నిర్ణయించుకుని ఉంటాడు. అది అతని బాహ్య ఆలోచనలకు అందనక్కరలేదు. ఇదే స్థితి స్త్రీకి కూడా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు స్త్రీ పురుషులు ఒకరికొకరు తారసపడి కొద్దిపాటి పరిచయం ఏర్పడితే చాలు వారు ప్రేమికులు కావడానికి చాలా అవకాశాలుంటాయని శాస్త్రవేత్తలు చెబుతారు.

ఏదేమైనా స్త్రీ పురుషులకు కొద్దిపాటి పరిచయం కలిగి, వారు ప్రేమికులుగా మారినపుడు చివరి దశగా రతి క్రీడకు సన్నద్దులవుతారు రతి అంటే. తను ఇష్టపడిన పురుషునికి తనను తాను సమర్పించుకోవడమే అని స్త్రీ భావిస్తుంది. అదే పురుషుడు అయితే స్త్రీ మీద ఒక విధమైన అధికారం సంపాదించుకోవడమని భావిస్తాడు. ఆ స్త్రీ ఇక తన సొంతమనుకుంటాడు. తను ఇష్టపడిన స్త్రీ మీద ఆ విధమైన అధికారం పొందడానికి యుద్ధానికైనా సిద్ధపడతాడు.


భారతీయ ఆచారంలో ప్రస్తుతం అనుసరిస్తున్న మాంగల్యధారణ వంటివి అన్నీ ఇలాంటి భావాలకి సంకేతాలనే చరిత్రకారులు చెబుతుంటారు. భారతీయ ఆచారాలలో ఇలాంటివే మరెన్నో ఉన్నాయి. వీటిని సమయం వచ్చినప్పుడు తెలుసుకుందాం...

సరే! స్త్రీ పురుషుల మధ్య ప్రణయం అంతిమంగా సమాగమానికి దారి తీస్తుందని చెప్పుకున్నాం కదా! రతికి ముందు కొన్ని పద్ధతులు అనుసరించాలని వాత్స్యాయనుడు చెబుతాడు.

రతి సమయంలో సాగించవలసిన చేష్టలు, రతి అనంతరం స్త్రీ పురుషులు ఎలాంటి పనులు చేయాలి? రతి సమయంలో శయనించవలసిన తీరుతెన్నులు, వివిధ జాతుల స్త్రీ పురుషుల మధ్య సాగే రతి క్రీడా విశేషాలు, వాటి పేర్లూ ఇలా ... ఎన్నో విషయాలు వివరించాడు.

ఇప్పుడు వాటిని గురించి ఒక్కొక్క విషయం తెలుసుకుందాం.

ముందుగా రతి ప్రారంభ సమయంలో అనుసరించ వలసిన పద్ధతులేమిటో చూద్దాం.

స్త్రీ పురుషులలో ముందుగా పురుషుడే శయన మందిరానికి చేరుకోవాలని సూచించాడు వాత్స్యాయనుడు. పడకటింటికి చేరిన పురుషుడు స్త్రీ వచ్చేలోగా కొద్దిగా మద్యం సేవించాలట. ఎందుకంటే మద్యం బిడియాన్ని కొద్దిగా తగ్గిస్తుందిట. సరే స్త్రీ కూడా శయన మందిరాన్ని చేరుకున్న తర్వాత ఆమెను కౌగిట్లోకి తీసుకుని మధురమైన మాటలు చెబుతూ నిదానంగా ఆమెచేత కూడా మద్యం తాగించాలి. దీనితో మొదటి అంకం పూర్తవుతుంది.


(మద్యం సర్వత్రా అనర్ధదాయకమని నేడు మన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయం మర్చిపోరాదు. మద్య సేవనం బిడియం పోగొట్టేమాట ఎలాగున్నా అసలుకే మోసం రావచ్చు. దీనిని మాత్రం సదా ఎల్లరూ గుర్తుంచుకోవాలి. ప్రాచీనకాలంలో మద్య సేవనం సమాజం ఆమోదించిన సంప్రదాయమైతే కావచ్చునేమో కానీ నేడు మాత్రం దానిలోని అనర్ధాలేవో అందరూ తెలుసుకున్నారు. పురాతన కాలంలో మద్య సేవనం ఒక సంప్రదాయంగా ఉన్నందువల్లే వాత్స్యాయనుడు దీని గురించి ప్రస్తావించి ఉంటాడని భావిస్తున్నారు).

కొద్దిగా మద్యం సేవించిన తర్వాత పురుషుడు, స్త్రీని మెల్లగా మాటలతో రెచ్చగొడుతూ స్త్రీకి కుడి వైపు పురుషుడు కూర్చుని ఆమె చేత మరింతగా మద్యం సేవింపచేయాలి. ఆమె పూర్తిగా మద్యం మత్తులో మునిగిపోకముందే అంటే బాహ్య స్మృతిలో ఉన్నప్పుడే మెల్లగా ఆమె వక్షోజాలు స్పృశిస్తూ, రతి క్రీడపట్ల ఆమెను వివశురాలిని చేస్తూ మెల్లగా రవిక ముడులు తీసివేయాలి.

ఇప్పుడామెను కౌగిలించుకుని, ఆమెతో ప్రణయ సంభాషణలు సాగించాలి. మరి స్త్రీ అప్పుడు ఏం చేస్తుంటుంది. మద్యం సేవించి ఉన్నప్పటికీ పూర్తిగా మత్తులో మునగక పోవడం వల్ల పురుషుడి చేష్టలు అన్నీ ఆమెకు తెలుస్తూనే ఉంటాయి. ఆమెలో మోహం పెరుగుతూ ఉంటుంది. వక్షోజాలు తడుముతున్నప్పుడు అది అధికం అవుతుంది. అప్పుడు తను కూడా పురుషుని మరింత గాఢంగా కౌగిలించుకుని అతనితో సమంగా మాటలు కొనసాగిస్తూ అతనిని రెచ్చగొడుతుండాలి.


అప్పుడప్పుడూ పురుషునికి అందీ అందకుండా అతని చేతి నుంచి జారిపోవాలి.

అయితే మద్యం బదులు పాలు కూడా సేవించవచ్చని వాత్స్యాయనుడు వివరిస్తున్నాడు. గోరు వెచ్చని పాలు సేవించనందువల్ల కూడా మదనోద్రేకం పెరుగుతుందని ఆయన చెబుతారు.

రతి ప్రారంభ సమయంలో స్త్రీని మెల్లగా తన చేష్టలతో వివశురాలిని చేసి సరస సల్లాపాలు సాగించాలి. ఇవన్నీ రతికి ముందు సాగించవలసిన పనులు. మరి రతి క్రీడ తర్వాత ఏం చేయాలి. దీనికి వాత్స్యాయనుడే సమాధానం చెబుతున్నాడు. దానిని తరువాయి భాగంలో తెలుసుకుందాం. 

-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------

 రతి సమయంలో ఆచరించవలసిన క్రియలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 16

రతి సమయంలో ఆచరించవలసిన క్రియలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. రతిసమయంలో విశేషాలను రాగవత్తు, ఆహార్యరాగం, కృత్రిమ రాగం, వ్యవహిత రాగం, పోటారతం, ఖలరతం, అనియంత్రిత రతం అని వాత్స్యాయనుడు విభజించాడు.

ప్రేయసీ ప్రియులు కొద్దికాలం పాటు వియోగం తర్వాత మరల కలుసుకొన్నప్పుడు, ప్రణయ కలహం వల్లకానీ మరే కారణాల వల్లనైనా కానీ కొంతకాలం దూరంగా ఉండి తర్వాత కలుసుకున్నప్పుడు జరిగే రతాన్ని రాగవత్తు అని అంటారు.

స్త్రీ పురుషులు ముందుగా ఎటువంటి పరిచయం లేనివారైనప్పటికీ వారి మధ్య ప్రేమ అంకురించి అది వారి కలయికు దారి తీస్తే అప్పుడూ అది రాగవత్తు అనే అంటారు.

రాగవత్తులో ప్రేయసీ ప్రియులు అంతకుముందే పరస్పరం ప్రేమానురాగాలు వృద్ధి పొందించుకున్నవారు కాబట్టి తమ తమ అభిప్రాయాలను అనుసరించి రతిక్రీడలో మునిగి తేలతారు.

స్త్రీ పురుషులు కేవలం చూపులతో పొందే సుఖాన్ని ఆహార్యరాగం అని అంటారు. స్త్రీ పురుషులు తన మనోగతాన్ని గురించి ఎదుటివారికి చెప్పకుండా చూపులతో వెంటాడుతూ తాపం తీర్చుకోవడమన్న మాట. ప్రేయసీ ప్రియులలో ప్రేమ అంకురించి, ఆ ప్రేమను వెల్లడించక ముందు సాగే ప్రక్రియగా దీన్ని పేర్కోవచ్చు.


కృత్రిమ రాగం: స్త్రీ పురుషుల మధ్య నిజమైన ప్రేమ జనించకుండా ఇద్దరిలో ఎవరైనా ఏదైనా ప్రయోజనం ఆశించి ఎదుటివారితో సంబంధం ఏర్పరచుకుంటే దానిని కృత్రిమరాగం అని అంటారు.
స్త్రీ మరో పురుషుడిని, పురుషుడు మరో స్త్రీని ప్రేమిస్తూ ఏదైనా ప్రయోజనంతో ( ధనం, రహస్యాలు తెలుసుకోవడం వంటివన్నమాట) రతిక్రీడకు సమ్మతిస్తే దానిని కృత్రిమ రాగం అని అంటారు. కృత్రిమరాగంలో స్త్రీ పురుషుల మధ్య అనురాగానికి తావుండదు. ఇతర విషయంపైనే వారి దృష్టి నిమగ్నమై ఉంటుంది.

వ్యవహితరాగం: స్త్రీ పురుషులు పరస్పరానురాగంతో రతి క్రీడలో పాల్గొంటే దానిని వ్యవహితరాగంగా చెప్పుకోవచ్చు. కృత్రిమరాగానికి ఇది పూర్తిగా విరుద్ధమైంది. ఇలా కాకుండా కేవలం పురుషుడే స్త్రీ పట్ల అనురాగం కనబరుస్తూ రతి సాగించినా దానిని కూడా వ్యవహిత రాగంగానే భావించవచ్చు.

పోటారతం: కామం తీర్చుకోవడం కోసమే స్త్రీ పురుషులు తమ పనివారితో సాగించే రతిని పోటారతం అని అంటారు. పోటారతంలో స్త్రీ పురుషుల మధ్య అనురాగముండదు. కామం తీర్చుకోవడమే వారి లక్ష్యం. ఇటువంటి రతి క్రీడలో రతి క్రీడ జరపాలే తప్పితే ముద్దులు, ఆలింగనాలు వంటి అనురాగ సంబంధమైన క్రియలు సాగించరాదు.

ఖల రతం: వేశ్యా వృత్తిలో వున్నవారు తమ కోరికను అనుసరించి ఎక్కువ సేపు రతి సాగించగల విటులు లభించనప్పుడు అందుబాటులో ఉన్నవారితో కాని, లేదా కాయ కష్టం చేసే వారితో కాని తమ కోరిక తీర్చుకుంటే అప్పుడది ఖల రతం అని అంటారు...


ఖల రతం కూడా ఒకవిధమైన పోటారతంవంటిదే. స్త్రీ తన కోరిక ప్రకారం, తను ఇష్టపడిన వ్యక్తిని ప్రేరేపిం చి అతనితో సాగించే రతిని ఖల రతం అనే అంటారు.

. . . .
అనియంత్ర రతం: చిన్నతనం నుండీ లేదా ఎక్కువకాలం కలిసిమెలిసి ఉన్న స్త్రీ పురుషుల మధ్య జరిగే రతాన్ని అనియంత్ర రతం అని అంటారు. ఈ రకమైన రతంలో స్త్రీ పురుషుల మధ్య ఎంతో కాలంగా సాన్నిహిత్యం ఉంటుంది. అందునా వారిరువురూ ఒకరిపై ఇష్టం చూపుతూ రతి క్రీడలో పాల్గొంటుంటారు కాబట్టి స్త్రీ పురుషుల నడుమ అనురాగం తప్పక జనిస్తుంది.

రతి క్రీడలో స్త్రీ పురుషుల ఇష్టాయిష్టాలను అనుసరించి వాత్స్యాయనుడు వర్గీకరించిన రకాలివి. మనోభీష్టాన్ని అనుసరించి వర్గీకరించినట్ట స్థల కాలాదులను, బంధాలను అనుసరించి కూడా వాత్స్యాయనుడు రతి క్రీడను వర్గీకరించాడు. అవేమిటో చూసే ముందు ముందుగా బంధాలు అంటే ఏమిటో తెలుసుకుందాం.


స్త్రీ పురుషులు రతి క్రీడలో పాల్గొనే వివిధ భంగిమలనే బంధాలని అంటారు. ఇవి రకరకాలుగా ఉండచ్చు. జంతువులు రతి సాగించే భంగిమలు కావచ్చు, స్త్రీ పురుషులు రతిలో సామాన్యానికి భిన్నంగా సాగించే భంగిమలైనా కావచ్చు. ఏదేమైనా ఇది భంగిమ ప్రధానమైంది. బంధాలలో ఎన్నో రకాలుండచ్చు. శునక బంధం, తురగాధి రూఢక బంధం, గజోప మర్దన బంధం ఇలా ఎన్నో రకాలున్నాయి. వీటి గురించి ముందుముందు తెలుసుకుందాం.

వాత్స్యాయనుడి కాలంలోని దేశాలను, ఆయాదేశాలలోని స్త్రీ పురుషుల అభిరుచులను కూడా ఆయన రచనల ద్వారా తెలుసుకోవచ్చు. ఏయే దేశ స్త్రీలు ఎటువంటి చేష్టలను ఇష్టపడతారో వాత్స్యాయనుడు వివరించాడు. వీటిని గురించి వచ్చే భాగాలలో తెలుసుకుందాం. 

-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------
 రతి తర్వాత స్త్రీ పురుషులు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 17

రతి తర్వాత స్త్రీ పురుషులు విడిపోయి గోరు వెచ్చనినీటితో స్నానం చేయాలి. స్నానం చేసిన పిదప తాంబూలం సేవించాలి. గంధం వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలను స్తీకి పురుషుడే స్వయంగా రాస్తూ ఆమెను తిరిగి ఆలింగనం చేసుకుని ఇద్దరూ తమకిష్టమైన పానీయాలు, అహారాలు సేవించాలి.

తర్వాత ఆరుబయట వెన్నెలలో స్త్రీ ఒడిలో పురుషుడు చేరి ముచ్చటించుకోవాలి. ఈ ముచ్చట్లలో ఎక్కువ భాగం శృంగార సంబంధమైనవే కావాలి.

వాత్స్యాయనుడు పైన చెప్పిన సూత్రాలన్నీ ఈనాటికీ మనం మనకు తెలియకుండా ఆచరిస్తున్నవే. రతి తర్వాత స్త్రీ పురుషులకు అలసట కలిగి చెమట పడుతుంది. ఈ అలసట తీర్చటానికి స్నానం అవసరం. తాంబూల సేవనం ఆరోగ్యకరం అని ఆయుర్వేదం చెబుతోంది.


ఇక స్త్రీ పురుషులు సన్నిహితంగా కబుర్లు చెప్పుకోవడంతో ఒకరి ఇష్టాయిష్టాలు మరొకరు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఒకరిపై మరొకరికి మరింత ప్రేమ కలుగుతుంది.

రతి క్రీడలో పాల్గొన్న స్త్రీ పురుషులు పూర్వ పరిచయం కలిగిన వారైతే తాము ప్రేమికులుగా ఉన్న కాలంలో, తన ప్రేమను వెల్లడించకముందు ఒకరికోసం ఒకరు ఎంతగా పరితపిచినదీ చెప్పుకోవాలి. దీనివల్ల వారిమధ్య నమ్మకం పెరిగి ప్రేమానురాగాలు బలపడతాయి.

వాత్స్యాయనుడు సూచించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రతి క్రీడ తర్వాత సుమారు రెండుగంటల వరకూ ఎటువంటి వ్యాయామం చేయకూడదు.
. . . .
..................................
అలాగే రతి క్రీడ అనంతరం స్త్రీ పురుషులు జననావయవాలను శుభ్రం చేసుకోవాలని గట్టిగా చెబుతాడు వాత్స్యాయనుడు. స్త్రీ జననావయంలో క్రిములు ఉండే అవకాశం ఉందని, ఆ క్రిముల వల్ల కొన్నిసార్లు వ్యాధుల పాలయ్యే ప్రమాదం కూడా ఉందని వాత్స్యాయనుడు హెచ్చరిస్తున్నాడు.

అందువల్లే సంభోగానంతరం స్నానం చేయాలని, జననావయవాలను శుభ్రం చేసుకోవాలని వాత్స్యాయనుడు హెచ్చరించాడని మనం అర్ధం చేసుకోవచ్చు.

----------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------

 రతి క్రీడలో బంధాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 18

రతి క్రీడలో అనేక రకాల బంధాలుంటాయని చెప్పుకున్నాము! అవేమిటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

స్త్రీ తన తొడలు, పిక్కలతో కలిపి సమానంగా పక్క భాగంలో వుంచి మోకాళ్ళు కూడా పక్కకు వుండేటట్టు చేసి పురుషుడిని సంభోగించమని కోరితే దాన్ని ఇంద్రాణి బంధం అని అంటారు.

క్రమ అభ్యాసం మీద మాత్రమే దీనిని చేయడం సాధ్య పడుతుందని వాత్స్యాయనుడు తెలిపాడు. ఇంద్రాణి బంధాన్ని మృగీజాతి స్త్రీ, వృష జాతి పురుషునితో (ఈ జాతుల గురించి గతంలోనే వివరించాం) సంభోగించినప్పుడే కాక, మృగీజాతి నాయికకు, అశ్వజాతి పురుషునికి సంబంధమేర్పడినప్పుడు కూడా చేయవచ్చని చెబుతారు.

స్త్రీ పురుషులు కాళ్ళు చక్కగా బారజాపి రతికి ఉపక్రమిస్తే దాన్ని సంపుటక బంధం అని అంటారు. ఈ సంపుటక బంధం రెండు రకాలు. ఒకటి పార్శ్వ సంపుటం, రెండోది ఉత్తాన సంపుటం. పక్కకు ఒత్తిగిల్లి సంభోగిస్తే అది పార్శ్వ సంపుటకం. ఈ బంధంలో ఎడమ పక్క పురుషుడు, కుడిపక్క స్త్రీ పరుండి ఉండే స్త్రీ ఎడమ కాలు పురుషుడి కుడిపక్క ఉంటుంది.


స్త్రీ వెల్లకిల పరుండి, పురుషుడు ఆమెపై బోర్ల పరుండి రతి సాగిస్తే దానిని ఉత్తాన సంపుటకం అని అంటారు. పురుషుడు వెల్లకిల పరుండి ఉండగా స్త్రీ అతని మీద బోర్ల పడుకుని పురుషుడిలా సంభోగిస్తే అది మరో రకం ఉత్తాన సంపుటక బంధం అని అంటారు. ఇలా చేసేప్పుడు పురుషుడి నడుము దిండు మీద, స్త్రీ నడుము పక్క మీదా ఉండాలి. అలా ఉండకపోతే బంధనం విడిపోతుంది.

నిద్రపోయేప్పుడు స్త్రీకి కుడి వైపు పురుషుడు, అతనికి ఎడమ వైపు స్త్రీ పరుండాలి. అన్ని జాతుల స్త్రీ పురుషులు నిద్రించే సమయంలో ఆచరించవలసిన విధానం ఇది. సంభోగ సమయంలో ఒక్క హస్తిని జాతి స్త్రీకి మాత్రం ఎడమ వైపున పురుషుడు, అతనికి కుడి వైపున స్త్రీ పరుండాలి.

ఉత్తాన సంపుటక బంధంలో కానీ, పార్శ్వ సంపుటక బంధంలో కాని స్త్రీ పురుషులు రతిక్రీడ సాగించేప్పుడు స్త్రీ పురుషుడి అంగాన్ని తనే ప్రవేశపెట్టుకుని రెండు తొడలు కలిపి నొక్కి పట్టుకుంటే దాన్ని పీడితకం అని అంటారు.

ఉత్తాన సంపుటక బంధంలో కానీ, పార్శ్వ సంపుటక బంధంలో కాని రతిక్రీడ సాగించేప్పుడు స్త్రీ తన కుడి తొడను పురుషుడి ఎడమ తొడ మీదా, ఎడమ తొడను కుడి తొడ మీదా ఉంచితే దాన్ని రెండు విధాలా వేష్టితక బంధం అంటారు. పైన చెప్పిన పీడితక బంధంకంటే ఈ బంధంలో స్త్రీ యోని బాగా ముడుచుకుని ఉంటుంది.

స్త్రీ కదలక మెదలక పరుండి పురుషుడి అంగాన్ని యోనితో బాగా గట్టిగా నొక్కిపెడితే దానిని బాడబక బంధం అని అంటారు. ఈ బంధన ప్రయోగానికి మంచి అభ్యాసం అవసరమని వాత్స్యాయనుడి అభిప్రాయం. ఆంధ్ర దేశంలో పుట్టిన స్త్రీలు ఈ బంధన ప్రయోగంలో ఆరితేరిన వారని ఆయన వివరించాడు. సంప్రదాయం తెలిసిన వారి వద్ద నుండీ, అనుభవజ్ఞుల నుండీ బంధన ప్రయోగాలలో ప్రావీణ్యం సంపాదించాలని వాత్స్యాయనుడు చెబుతున్నాడు...


. . .
హస్తినీ జాతి స్త్రీ వెల్లకిల పరుండి తన రెండు తొడాలనూ పైకి చాచినప్పుడు పురుషుడు ఆమె తొడలు కౌగిలించుకుని రతి చేస్తే దాన్ని భుగ్నకం అని అంటారు.

స్త్రీ తన కాళ్ళు పైకి ఎత్తి ఉంచితే పురుషుడు ఆమె మోకాళ్ళ వెనుక భాగాన్ని తన భుజాల మీద పెట్టుకుని తొడలను కౌగిలించుకుంటూ రమించడాన్ని జృంభితక బంధం అంటారు.

స్త్రీ, పురుషుడి వక్ష స్థలం మీద తన రెండు పాదాలు ఆనించి ఉన్నప్పుడు పురుషుడు తన చేతులతో స్త్రీ మెడను కౌగిలించుకుని సంభోగిస్తే దాన్ని ఉత్పీడితక బంధం అని అంటారు.

ఈ బంధంలో స్త్రీ తన మోకాళ్ళు బాగా వంచి, తన భుజాల దగ్గరికి చేర్చి ఉండాలి. ఈ విధంగా స్త్రీ తన పాదం ఒక దాన్ని మాత్రం పురుషుడి వక్ష స్థలం మీద ఉంచి, రెండో పాదాన్ని సాపుగా చాచినప్పుడు ఉత్పీడికంలో లాగానే రతి చేస్తే దాన్ని అర్ద పీడితకం అని అంటారు.

రతి క్రీడలో అవలంబించదగిన మరికొన్ని భంగిమలు ఇప్పుడు చూద్దాం. పైన చెప్పిన భంగిమలకంటే ఇప్పుడు వివరించబోయే బంధనాలు కష్టసాధ్యమైనవి. వీటిలో కొన్ని కూర్చుండి, నిల్చుని సాగించదగినవి కూడా ఉన్నాయి.

నిల్చుని చేసే రతాలలో గోడను కానీ మరేదైనా ఒక ఆధారాన్ని సహాయంగా తీసుకోవాలి. ఇలా నిల్చుని గోడను రతి క్రీడ సాగిస్తే దాన్ని స్థిత రతంఅని అంటారు.

గోడకు కాని లేదా స్థంభానికి కాని పురుషుడు ఆనుకుని ఉండగా స్త్రీ అతని కంఠాన్ని తన చేతులతో చుట్టేసి, అతని కౌగిలిలో తానుండి తన తొడలతో అతని నడుమును చుట్టి తన నడుముతో అతడిని ప్రేరేపిస్తూ రతిలో పాల్గొంటే దానిని అవలంబితకం అని అంటారు.

ఆవులాగా నేల మీద రెండు చేతులూ, రెండు కాళ్ళూ ఉంచి ఉన్న స్త్రీని పురుషుడు వెనుక నుండి ఆంబోతు లాగా రతి చేస్తే దాన్ని ధేనుక బంధం అని అంటారు. ధేనుక బంధంలో నఖ, దంత క్షతాలన్నీ స్త్రీ వీపు మీదనే ప్రయోగించవలసి ఉంటుంది.

పరస్పరం నమ్మకం కలిగిన స్త్రీలు ఒకే పురుషునితో ఏక కాలంలో రతి క్రీడ సాగించాలని తలిస్తే, అప్పుడా పురుషుడు ఏకకాలంలో ఇద్దరితో సరస సల్లాపాలు సాగిస్తే అప్పుడు దానిని సంఘాటకం అని అంటారు.

ఇది ఎలా సాగించాలంటే.....
ఇద్దరు స్త్రీలూ వెల్లకిలా పరుండి ఉంటే పురుషుడు ఒక స్త్రీ యోనిలో తన అంగాన్ని ప్రవేశపెట్టి , రెండో స్త్రీని ముద్దాడుతూ, వక్షోజాలను మర్దిస్తూ, నఖమ దంత క్షతాలు సాగిస్తుంటాడు. కొద్దిసేపటి తర్వాత రెండో స్త్రీ యోనిలో అంగాన్ని ప్రవేశపెట్టి, మొదటి స్త్రీతో సరస సల్లాపాలు సాగిస్తుంటాడు. ఇలా ఒకే పురుషుడు ఏకకాలంలో ఇద్దరు స్త్రీలతో సుఖిస్తుంటాడు. ఇద్దరు స్త్రీలతో సాగిస్తే సంఘాటకం అని అంటారు.


అదే స్త్రీల సంఖ్య మరింతగా పెరిగిపోతే అప్పుడు దాన్ని గౌయూధికం అని అంటారు. అంటే ఆవుల మందలో ఆబోతు చొరబడి తన దాహాన్ని తీర్చుకున్నట్టు పురుషుడు ప్రవర్తించడం అన్నమాట.

నీళ్ళలో మగ ఏనుగు అనేక ఆడ ఏనుగులతో క్రీడిస్తున్నట్టు పురుషుడు నీళ్లతో అనేక మంది స్త్రీలతో రమించడాన్ని వారీ క్రీడితకం అని అంటారు.

ఇదే విధంగా మేకపోతు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తే ఛాగలమని, లేడి వలే రమిస్తే ఐణేయమని అని అంటారు.


పైన చెప్పినవన్నీ అనేక మంది స్త్రీలతో ఒక పురుషుడు సాగించే రతి విశేషాలు.
ఇక ఇప్పుడు చెప్పబోయేవి అనేక మంది పురుషులతో ఒక స్త్రీ సుఖించే పద్ధతులు.


ఒక స్త్రీతో ఒక్కొక్కడూ ఒక్కో రకంగా సుఖించాలి. ఒకరు స్త్రీని తన తొడలపై కూర్చోబెట్టుకోవాలి. ఒకరు స్త్రీ ముఖాన్ని ముద్దాడుతుండగా, మరొకరు ఆమె తొడలపై నఖ దంత క్షతాలు చేస్తుండాలి. వేరొకరు తన అంగాన్ని ఆమె యోనిలో ప్రవేశపెట్టాలి. ఇలా ఒక స్త్రీతో అనేక మంది పురుషులు రమించవచ్చు.

అయితే ఇది చాలా నీచమైన పద్ధతి.

ఒక పురుషుడు మరొక పురుషునితో తన కామదాహం తీర్చుకోవడం( GAY ), పురుషునితో పురుషుడు ప్రవర్తించినట్టే స్త్రీతో వ్యవహరించడం( ANAL ) వంటివెన్నో బంధనాలున్నాయి. ఇటువంటివి నిషిద్ధాలని వాత్స్యాయనుడు హెచ్చరిస్తున్నాడు. 
-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------
 శృంగారంలో చిరుదెబ్బలు కూడా ఆనందాన్ని పెంచుతాయి :: వాత్స్యాయన కామశాస్త్రం Part 19

శృంగార క్రీడలో స్త్రీ, పురుషులు పరస్పరానురాగంతో, ఉద్రేకం అధికమైనప్పుడు తమ ప్రేమను నఖ, దంత క్షతాల రూపంలో బహిర్గతం చేస్తుంటారని గతంలో మనం తెలుసుకున్నాం.

ఇవే కాకుండా రతి సమయంలో తమ అనురాగాన్ని వ్యక్తం చేసేమార్గాలు మరికొన్ని కూడా ఉన్నాయని వాత్స్యాయనుడు చెబుతున్నాడు.

అవేమిటంటే పురుషుడు స్త్రీని సుతిమెత్తగా మోదుతుంటే స్త్రీ కూజితాల(మూలుగు) రూపంలో వెలిబుచ్చుతూంది. ఇది రతి సమయంలో తమ ప్రేమను బహిర్గతం చేసే మరో మార్గమే కాదు. ప్రేయసీ ప్రియులిరువురికీ ఆనందాన్ని పెంచుతుంది కూడా.

నఖ, దంత క్షతాలలో ఎన్నో రకాలున్నట్టే వీటిలో కూడా అనేక రకాలున్నాయని, ఒకో రకానికి ఒక్కోరకమైన ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుందని శాస్త్రకారులు వివరిస్తున్నారు శృంగార క్రీడ కూడా సమరం వంటిదే.


ప్రేయసీ ప్రియులిరువురూ ఒకరినొకరు వెక్కిరించుకుంటూ, కలహించుకుంటూ రతిలో మునిగి తేలుతూ ఆనందాన్ని పొందుతారు. ఇలా సాగే శృంగార సమరంలో ముద్దులూ మురిపాలే కాదు చిరుదెబ్బలు కూడా ఆనందాన్ని పెంచుతుంటాయి.

చిరుదెబ్బలను సాధారణంగా స్త్రీపై పురుషుడు ప్రయోగిస్తుంటాడు. నఖ, దంత క్షతాలకు వలె వీటిని ప్రయోగించడానికి స్త్రీ దేహంపై నిర్ణీత ప్రదేశాలేమైనా ఉంటాయా అని అంటే- ఉంటాయి. అవి ఏమిటంటే....

స్త్రీ భుజాలు, శిరస్సు, స్థనాల మధ్య, వీపు, కటి .

ఈ ప్రదేశాలలో చిరు దెబ్బలు స్త్రీకి అపరిమితమైన సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. ఈ ప్రదేశాలలో స్త్రీపై పురుషుడు ప్రయోగించే చిరుదెబ్బలనే ప్రహరణాలు అని పిలుస్తారు. వీటిలో అనేక రకాలున్నాయి. అందులో మరీ ముఖ్యమైనవి నాలుగు. అవి...
1. అపహస్తకం
2. ప్రసృతకం
3. ముష్టి
4. సమతలకం


అపహస్తకం అంటే అరచేతి వెనుక భాగంతో చరచడం. ఈ దెబ్బలో చేతి వేళ్లు మాత్రమే తగులుతాయి.
ముష్టి అంటే పిడికిలితో చరచడం.
ఇక అరచేతిని చాచి స్థనాలను మర్దించం సమతలకం...

రతికి తోడు ఈ చిరుదెబ్బల వల్ల కలిగే సుఖం వల్ల స్త్రీ పారవశ్యంతో చేసే ధ్వనులే కూజితాలు. ముఖ్యంగా చెప్పుకోవలసింది ఏమిటంటే ఇలాంటి ప్రహరణాల వల్లే కూజితాలు మరింత ఎక్కువగా వస్తుంటాయిట. ఆ విధంగా ప్రహరణాలకు కూజితాలకు మధ్య సంబంధముందని వాత్స్యాయన ముని వివరిస్తున్నాడు.

రతి సమయంలో కలిగిన సౌఖ్యం వల్ల స్త్రీ ఆనందంతో చేసే కూజితాలలో ఎనిమిది రకాలున్నాయి. అవి
1. హింకారం,
2. స్తనితం,
3. కూజితం,
4. రుదితం,
5. సూత్కృతం,
6. ధూత్కృతం,
7. పూత్కృతం.
వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


హింకారం అంటే అమితంగా సౌఖ్యం కలిగినప్పుడు, పెదవులతో నోరు మూసుకుని, గొంతుతో, ముక్కుతో 'హి..., హీ...' అని శబ్దం చేయడం.

స్తవితం అంటే మేఘ ధ్వనిలా పెద్దగా శబ్దం చేయడం ఇది కఠంతో చేసే ధ్వని.

రుదితం అంటే ఏడుస్తున్నట్టు ధ్వని చేయడం.

సూత్కృతం అంటే నిట్టూర్పు విడవటం. మిగిలిన వాటి లక్షణాలను ముందు ముందు తెలుసుకుందాం.

ప్రహరణాలు, కూజితాలలో రకాలివి. ప్రహరణాలు ప్రయోగించవలసిన ప్రదేశాలు ఉన్నట్టే వాటిని ప్రయోగించాల్సిన సమయం కూడా ఉంటుందిట.

అంటే రతి సమయంలో ఒక్కో స్థాయిలో ఒక్కో ప్రహరణాన్ని ప్రయోగించాలిట. వీటిని అనుబంధంగానే స్రీ కూజితాలు చేయాల్సిఉంటుంది.
అంటే సమయాన్ని ఎరిగి పురుషుడు ఎటువంటి ప్రహరణాలు చేస్తుంటాడో, అదేవిధంగా స్త్రీ పురుషుడిని గమనిస్తూ ఆ ప్రహరణానికి తగిన కూజితాన్ని చేయాలన్న మాట. 
-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------
రతి సమయంలో కూజితాలు ప్రహరణాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 20

ప్రహరణాలు కూజితాలు అంటే ఏమిటో గతవారం కొద్దిగా తెలుసుకున్నారు కదూ! రతి సమయంలో కూజితాలనేవి సహజమని వాత్స్యాయనుడు వివరిస్తున్నాడు.

కూజితాలను గురించి మరింతగా వివరిస్తూ- రతి సమయంలో స్త్రీ ఉద్రేకం, పారవశ్యం కొద్దీ ఒళ్ళుమరిచి మంద్ర స్థాయి నుండీ కేరింతల వరకు వెలువరించే రకరకాల శబ్దాలన్నీ కూజితాల కోవలోకే వస్తాయని చెబుతారు.

రతి అనేది స్త్రీ పురుషులిరువురికీ ఒకవిధమైన ఆనందాన్ని, సుఖాన్ని కలిగించే అవస్థ.

ఇప్పుడు ఏయే సమయంలో ఎటువంటి ప్రహరణాలు చేయాలి? ఆ ప్రహరణాలకు స్త్రీ ఎలా స్పందించాలి అన్న విషయాలు చూద్దాం.

పురుషుడు రతి చేయకుండా ఉండి కేవలం సరస సల్లాపాలకు మాత్రమే పరిమితమై ఉన్నప్పుడు తన తొడ మీద కూర్చుని ఉన్న స్త్రీ వీపు మీద నెమ్మదిగా పిడికిలితో మోదాలి. పురుషుడు ఇలా మోదినప్పుడు స్త్రీ దానిని తాళలేనట్టు కాంత స్తనితాన్ని, కూజితాన్ని, రుజితాన్ని చేయాలి.

రతి సమయంలో ప్రియుడు పదేపదే తాడనాలు చేస్తున్నప్పుడు స్త్రీ దాన్ని భరించలేనట్టు ఇకచాలు చాలంటూ గారాలు పోతూ ప్రియుడిని రెచ్చగొట్టే విధంగా శ్వసితం, రుదితం, స్తవితం తదితర కూజితాలు చేయాలి.

రతి తార స్థాయిలో సాగుతున్నప్పుడు పురుషుడు, స్త్రీ వక్షోజాల మధ్య అరచేతి వెనుక భాగంతో నెమ్మదిగా చరుస్తూ ఉండాలి. వీటిని రతి ప్రారంభ సమయంలో నెమ్మదిగా ప్రారంభించి ముందుకు సాగుతున్న కొద్దీ ప్రహరణాలు హెచ్చిస్తూ ఉండాలి. స్త్రీ దీనికి అనుగుణంగానే హింకారం తదితర కూజితాలు చేయాలి.

స్త్రీ తనతో వాగ్వివాదం చేస్తున్నప్పుడు పురుషుడు తన చేతివేళ్ళు కొంచెం వంచి అరచేతి వెనుక భాగంతో ఆమె తల మీద వూత్కారం చేస్తూ కొట్టాలి. దీనిని ప్రసృతకం అని పిలుస్తారు...

ప్రియుడు ప్రసృతకం ప్రయోగించినప్పుడు ప్రియురాలు పూత్కృతం అనే కూజితం చేయాలి. నీళ్లలో ఏదైనా వస్తువు మునుగుతున్నప్పుడు బుడుంగు మనే శబ్దం వస్తుంది.

స్త్రీ దవడల పైభాగాన్నినాలుకతో కలిపి ఉచ్చరిసే ఇటువంటి శబ్దం పుడుతుంది.


పురుషుడు రతి చివరి సమయంలో నఖ, దంత క్షతాలు చేసినప్పుడు స్త్రీ అలిసిపోయునట్టు నటిస్తూ దూత్కృతం అనే కూజితం చేయాలి. సంభోగం చివరిలో శ్వసితం, రుదితం అనే కూజితాలు చేయాలి. ఈ సమయంలో స్కలనంమయ్యే వరకు కటి ప్రదేశానికి రెండు వైపులా మెల్లగా చరుస్తూ ఉండాలి.

ప్రహరణాల ప్రయోగంలో చాలా జాగ్రత్త అవసరం అని శాస్త్రకారులు హెచ్చరిస్తున్నారు. ప్రియుడు తెలిసీ తెలియక కామోద్రేకంలో బలమైన ప్రహరణాలు చేస్తే అవి స్త్రీ ప్రాణానికి ముప్పు కలిగించవచ్చని వాత్స్యాయనాది మునులు పేర్కొన్నారు.

చరిత్రలో ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయిట. మదనోద్రేకంలో రాజులు చేసిన బలమైన ప్రహరణాల వల్ల వారి ప్రియురాండ్రు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలెన్నో ఉన్నాయి. అందువల్ల పురుషుడు ప్రహరణాల పట్ల జాగురూకతతో వ్యవహరిస్తూ స్త్రీ స్థితిని గమనిస్తూ ఆమె భరించగలిగే స్థాయిలోనే ప్రహరణాలు చేయాలి.

అసలు స్త్రీ పురుషులలో పురుషుడే ప్రహరణాలు ఎందుకు చేస్తాడు? స్త్రీ కూజితాలు ఎందుకు చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా జరగచ్చు కదా!, అంటే స్త్రీ ప్రహరణాలు చేస్తున్నప్పుడు పురుషుడు కూజితాలు చేయడం వంటిదన్న మాట. దీనికి సమాధానం ఏమిటంటే.

నిజమే చేయచ్చు. కానీ ప్రకృతిపరంగా పురుషుడు బలమైనవాడు. స్త్రీ కోమలి. పురుషునికి పౌరుషం, శక్తి ఎక్కువ. అందుకనే అతను రతి సమయంలో బలమైన ప్రహరణాలు చేయగలుగుతాడు.

ముందు చెప్పుకున్నట్టు స్త్రీ కోమలి కావడం వల్ల ప్రహరణాలు చేయలేదు. ఒకవేళ చేసినా స్త్రీకే ఎక్కువ బాధ కలుగుతుంది. స్త్రీ ప్రహరణాలు చేస్తుంటే పురుషుడు మళ్ళీ మళ్ళీ కోరినా ఆమె ప్రహరణాలు చేసే శక్తి ఉండదు. అందుకే ఆమె ప్రహరణాలు చేయలేదు.
పురుషుడు చేస్తున్న ప్రహరణాల వల్ల హాయిని పొందుతూ కూజితాలు మాత్రమే చేయగలుగుతుంది. 
 ----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------
 శృంగారంలో పురుషాయితం :: వాత్స్యాయన కామశాస్త్రం Part 21

రతిలో పాల్గొనడం వల్ల, ప్రహరణాలు తదితర ప్రయోగాదుల వల్ల కలిగిన శ్రమతో పురుషుడు అలసిపోతాడు. అతను అలసిపోయినప్పుడు రతిని మరింత ఎక్కువసేపు కొనసాగించలేకపోతాడు.

ఇటువంటి స్థితిలో స్త్రీ విజృంభించి పురుషాయితానికి ఉపక్రమించాలి. అప్పుడు రతిని మరింత ఎక్కువ సేపు కొనసాగించడానికి వీలవుతుంది.

పురుషాయితమంటే ఏమిటి? అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.పురుషుడు రతి సలిపి అలిసిపోయినప్పటికీ సంభోగేచ్ఛ కలిగిఉంటే స్త్రీ ఆ విషయాన్ని గ్రహించి, పురుషుని అనుమతితో పురుషాయితాన్ని ప్రారంభించాలి అని వాత్స్యాయనుడు వివరిస్తున్నాడు.

పురుషాయితమంటే స్త్రీపైన, పురుషుడు కింద ఉండి సాగించే సంభోగ ప్రక్రియ. సాధారణ రతికి ఇది సరిగ్గా వ్యతిరేకమైనదన్నమాట.


పురుషాయితంలో ఎన్నోరకాలున్నాయి. రతిలో ఒక భంగిమగా చెప్పుకునే పురుషాయితాన్ని అనుసరించే పద్ధతిలో భేదాలున్నాయి. ప్రేయసీప్రియులు తమ తమ ఇష్టాయిష్టాలను అనుసరించి పురుషాయితాన్ని అనుసరించవచ్చు.

పురుషాయితాన్ని అవలంబిస్తున్నప్పుడు స్త్రీ, పురుషుని అనుమతి పొందడం మాత్రం తప్పనిసరి. పురుషాయితాన్ని పురుషుడు ఇష్టపడుతున్నాడని గ్రహించిన తర్వాతే స్త్రీ ఈ ప్రక్రియకు ఉపక్రమించాలి. ఈ పురుషాయితంలో రకాలేమిటో, పురుషాయితాన్ని ఎలా ప్రారంభించలో ఇపుడు చూద్దాం.

మొదట స్త్రీ వెల్లకిలా పడుకుని ఉండగా నాయకుడు సంభోగం చేస్తూ, ఆమెను గాఢంగా కౌగిలించుకుని ఆమె నుండీ విడిపోకుండానే క్రమంగా ఇద్దరూ కూర్చొనే స్థితికి, అక్కడి నుండీ చేరుకోవాలి.

కూర్చొన్నప్పుడు స్త్రీ పురుషుని మీద వాలిపోవాలి. ఆ తర్వాత పురుషుడు మెల్లగా కిందకి ఒరిగిపోతుంటే స్త్రీ అతని పైకి చేరుకోవాలి. సాధారణంగా ప్రారంభమైన రతి ఇలా పురుషాయితానికి దిగుతుంది. ప్రేయసీ, ప్రియులు విడిపోకుండానే కొనసాగించే ఈ రతి ప్రక్రియ వారికి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది.

ప్రియుడు రతి వల్ల బాగా అలసిపోయి, ఇంకా రతిని కొనసాగించాలని ఉత్సుకత చూపుతున్నప్పుడు పురుషుని అనుమతితో స్త్రీ అనుసరించవలసిన ప్రక్రియ ఇది.

పురుషాయితంలో పైన వివరించినది ఒక పద్ధతి. ఆదిలో సాధారణ రతి భంగిమతో ప్రారంభించి చివరికి పురుషాయితంతో ముగించడం ఈ పద్ధతి. ఇది కాకుండా మొదటి నుండే స్త్రీ పురుషులు పురుషాయిత భంగిమలోనే రతి సాగించడం మరో పద్ధతి.

పురుషాయితాన్ని రెండు కోవలుగా విభజించవచ్చు. ఒకటో రకాన్ని బాహ్యమనీ, రెండవరకాన్ని అభ్యంతతమనీ పిలుస్తారు.

స్త్రీ చిరునవ్వులు చిందిస్తూ, పురుషుడిని ముద్దులతో ముంచి తేలుస్తూ, అతనిముద్దాడే సమయంలో తన వక్షోజాలను అతని ఛాతీకి గట్టిగా అదుముతూ, పురుషుడు సాధారణంగా స్త్రీని ఎటువంటి చేష్టలతో రంజింపజేయడానికి ప్రయత్నిస్తుంటాడో స్త్రీ అటువంటి చేష్టలు చేస్తూ, నడుమనడుమ సిగ్గుపడుతూ పురుషుడిని రెచ్చగొడుతూ రతి సాగించాలి.

మోటుగా ప్రవర్తించి బాధిస్తానని పురుషుడిని బెదిరించాలి. బెదిరించడమే కాదు అప్పుడప్పుడు దానిని ఆచరణలో కూడా చూపాలి. అంతలోనే భయం నటిస్తూ పురుషుడి పట్ల వినయం ప్రదర్శించాలి. ప్రహరణాలకు ప్రయత్నించాలి. పురుషాయిత ప్రక్రియలో స్త్రీ నిర్లజ్జగా ప్రవర్తిస్తున్నట్టు కనపడాలే కానీ పూర్తిగా సిగ్గును విడిచిపెట్టరాదు.

తొలుత సాధారణంగా ప్రారంభించిన రతిని పురుషాయిత ప్రక్రియకు దిగితే దానిని బాహ్యమని అంటారు. అలాకాకుండా స్త్రీ పురుషుడిలాగే రతి చేస్తే దాన్ని అభ్యంతర పురుషాయితమని అంటారు. అంటే ఆదినుండి కూడా స్త్రీ పురుషుడిపై కూర్చుని సాగించే సంభోగం.

పురుషాయితం విశేషమైన ప్రక్రియ అని వాత్స్యాయనుడి అభిప్రాయం. రతి క్రీడ సమయాన్ని పెంచుకోవడానికి ఇదో అద్భుత మార్గం. స్త్రీ పురుషుల సరదాలు తీర్చుకోవడానికి పురుషాయితంలో ఎన్నో మార్గాలున్నాయి .
-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------
 పురుషోపనృప్తాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 22

పురుషాయితమంటే ఏమిటో చూశారు కదా! రతిలో స్త్రీ పురుషుని వలె ప్రవర్తించడాన్ని పురుషాయితమని అంటారు.

మరి ఆ సమయంలో పురుషుని చేష్టలను ఏమంటారంటే పురుషోపనృప్తాలని పిలుస్తారు.

ఈ సమయంలో పురుషుడు స్త్రీని మెల్లగా మాటల్లో దింపి ఆమెను మాటల్లో దించి సరససల్లాపాలతో రతి క్రీడకు సన్నద్ధం చేయాలి. ఆమె దానికి అంగీకరించకపోతే ఆమెపై వివిధ రకాల ముద్దులు ప్రయోగించి, ఆమె ఇష్టపడే రకరకాల శృంగార చేష్టలతో ఆమెను వివశురాలిని చేయాలి. ఆమె ఆదమరిచి ఉన్న సమయంలో ఆమెను మెల్లిగా రతికి సన్నద్ధురాలిని చేయాలి.


స్త్రీతో సరససల్లాపాలు సాగించే సమయంలో ఆమె పలు విధాలుగా ప్రవర్తించడానికి అవకాశముంది. స్త్రీ కనుక పురుషునికి కొద్దిగా పరిచయం ఉండి శృంగార అనుభవం లేనట్లయితే ఎక్కువగా సిగ్గుపడుతూ కనులు మూసుకుని పురుషునికి సహకారం అందిస్తూ ఉంటుంది.

స్త్రీ పురుషులకు మధ్య సంబంధం కొద్దికాలంగా కొనసాగుతుంటే ఆమె ఇష్టాఇష్టాలు పురుషునికీ తెలుస్తాయి. కాబట్టి తదనుగుణంగా ప్రవర్తించవచ్చు. ఈ సమయంలో కూడా స్త్రీలో సిగ్గు పూర్తిగా తగ్గదు.

స్త్రీ పురుషులకు సన్నిహిత సంబంధాలు ఏర్పడి చాలా కాలంగా చనువుగా మెలుగుతూ ఉంటే ఆమె ఇంతగా సిగ్గుపడదు. తనకేది కావాలో ఆమే పురుషునికి చెబుతుంది. నిర్భయంగా స్వేచ్ఛగా ప్రవర్తిస్తుంది. సిగ్గు తగ్గడంతో శృంగారంలోని ఆనందాన్ని అనుభవించడానికి ఆమె పూర్తిగా సంసిద్ధురాలై ఉంటుంది. పురుషుడు యథేచ్ఛగా ప్రవర్తిస్తున్నా అతనికి సహకరిస్తూ తామూ ఆనందాన్ని పొందుతుంటారు.

ఇలాంటి సమయంలో స్త్రీని వివశురాలిని చేయడానికి ఆమె దేహంపై అక్కడక్కడా తన మర్మావయవాన్ని తాకిస్తుండాలి. ఇలా చేస్తున్నప్పుడు ఆమె కిలాకిలా నవ్వుతుంది. మెల్లిగా పురుషునికి వశమైపోతుంది.

ఇక అంగప్రవేశం జరిగి రతి ప్రారంభించినప్పుడు పురుషునితో ఆలింగన చుంబనాది చర్యల వల్ల సుఖం పొందుతూ కూజితాలు ఆరంభిస్తుంది. తన చూపును ఏదో ఒక వైపు నిమగ్నం చేస్తుంది. పురుషుడు దానిని గమనించాలి. ఆమె ఏ దిక్కుగా చూపును కేంద్రీకరిస్తుందో ఆ దిక్కులో తన అవయవంతో ఆమె జననేంద్రియాన్ని పీడించాలి.

దీనివల్ల స్త్రీ త్వరగా తృప్తి పొందుతుంది. తమకు ఏ చర్య వల్ల ఎక్కువ సుఖం లభిస్తుందో స్త్రీలు త్వరగా చెప్పరు. వారి చేష్టల వల్లే పురుషులు దానిని గ్రహించాలి.

స్త్రీ శరీరంలోని వివిధ అంగాల్ని తన అవయవంతో తాకిస్తున్నప్పుడు, ఎక్కడ తాకిస్తున్నప్పుడు, ఎక్కువ సుఖం కలుగుతుందో పురుషులే గ్రహించాలి. తదనుగుణంగా ప్రవర్తిస్తూ వక్షోజాలను మర్దిస్తూ శృంగారాన్ని కొనసాగించాలి.

స్త్రీకి భావప్రాప్తి కలిగిందనడానికి గుర్తు ఏమిటి? పురుషులను వేధించే ప్రశ్నే ఇది. శృంగార క్రీడకు పరాకాష్టగా చెప్పుకునే భావప్రాప్తిని గుర్తించడం ఎలా? దీనిని గుర్తిస్తే చాలు పురుషుడు ఎంతో తృప్తి పొందుతాడు.

నిజానికి పురుషునికంటే స్తీకే శృంగారేచ్ఛ సుమారు ఎనిమిది రెట్లు ఎక్కువ. ఇంతకు ముందు కూడా ఈ విషయాన్ని చెప్పుకున్నాం. మరి శృంగారేచ్ఛ అంత ఎక్కువున్న స్త్రీని సంతృప్తి పరిస్తే పురుషునికి కలిగే ఆనందాన్ని వర్ణించలేం. 
-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------
స్త్రీలలో భావప్రాప్తిని గుర్తించడం ఎలా.? :: వాత్స్యాయన కామశాస్త్రం Part 23

రతిలో స్త్రీకి సంతృప్తి కలిగిందనడానికి గుర్తు ఆమె భావప్రాప్తికి గురికావడం. అసలు భావప్రాప్తినే ఆమెకు రతిలో పరాకాష్టగా చెప్పుకోవచ్చు.

పురుషునికి వీర్య స్కలనం కావడాన్ని రతిలో ఉచ్చస్థితిగా భావిస్తే స్త్రీలో భావప్రాప్తినిదానికి చిహ్నంగా చెబుతారు.

పురుషునికి వీర్యస్కలనం కలిగితే దానిని స్త్రీ గుర్తించగలదు. మరి స్త్రీకి భావప్రాప్తి కలిగితే దానిని గుర్తించడమెలా?

భావప్రాప్తి సమయంలో స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకుంటే చాలు దీనికి సమాధానం దొరికినట్టే. మరి భావప్రాప్తి సమయంలో స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో , ఆ లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్త్రీ ఇక ఆగలేక పురుషుడిని తనకేసి బలంగా హత్తుకుంటూ ఎక్కువ రతికోసం ఆరాటపడుతుంది.
గట్టిగా కనులు మూసుకుంటుంది. సిగ్గుపడుతుంది.
భావప్రాప్తి పొందబోయే సమయంలో తన చేతులు విదిలిస్తుంటుంది.

దేహమంతటా ఆమెకు చెమటలు పోస్తుంటాయి.
పురుషుణ్ణి కదలనివ్వకుండా, లేవనీయకుండా తనకేసి బలంగా హత్తుకుంటుంది.
నఖ, దంత క్షతాలు చేస్తుంది.
పురుషుడిపై పదేపదే ముద్దులు కురిపిస్తుంది.
తన పాదాలు పురుషుడి పాదాలపై నొక్కుతుంది. పురుషునికన్నా తనకే ముందే భావప్రాప్తి కలిగితే తానే అతనిపై పడి నడుం ఆడిస్తుంది.

ఇంతకన్నా స్త్రీలలో భావప్రాప్తి సమయంలో సామాన్యంగా కనిపించే లక్షణాలను గుర్తించడం కష్టమని అంటారు వాత్స్యాయనుడు.


అయితే భావప్రాప్తి సమయంలో స్త్రీ పొందే ఆనందం వర్ణనాతీతమని, తనకు అటువంటి ఆనందాన్ని కలిగించిన పురుషుడిని స్త్రీ ఆజన్మాంతం గుర్తుంచుకొంటుందనీ ఆయన పేర్కొంటారు.
అటువంటి పురుషుడి కోసం పరితపిస్తూ, అతడితో శృంగారం జరపాలని కోరుకుంటూ ఉంటుందని ఆయన చెబుతారు.

రతి క్రీడలో స్త్రీని సంతృప్తి పరచడానికి అనేక మార్గాలున్నాయని వాత్స్యాయనుడు సూచిస్తున్నాడు. ఆ మార్గాలు అనుసరించడం ద్వారా స్త్రీని మరింతగా తృప్తి పరచవచ్చని తద్వారా స్త్రీకి తనకంటే ముందే భావప్రాప్తి కలిగించవచ్చని వాత్స్యాయనుడు చెబుతున్నాడు.

పురుషుడు తన అంగాన్ని ప్రవేశపెట్టే ముందుగానే స్త్రీని రకరకాలుగా ఉద్రేకం కలిగించాలి. తనకంటే ముందుగానే భావప్రాప్తి కలిగించడానికి ఆమె భగాన్ని నెమ్మదిగా కదిలించాలి. అప్పుడు ఆమెకు కామోద్రేకం అధికమవుతుంది. అప్పుడు పురుషుడు అంగాన్ని ప్రవేశపెట్టాలి.

అయితే పురుషుడు స్త్రీ భగాన్ని ఉనికి ఆధారంగా నాలుగు భాగాలున్నాయని వాత్స్యాయనుడు పేర్కొంటున్నాడు. అవి సంబాధం, భగం, యంత్రం.


ముందుగా స్త్రీ భగాన్ని ఎలా కదిలించాలో చూడండి. పురుషుడు తన చేతి నాలుగో వేలును చూపుడు వేలుతో కలిపి పట్టి స్త్రీ భగాన్ని కదిలించాలి, స్త్రీ భగంలో కొంత భాగం తామరపువ్వు రేకులాగా, మరి కొంత భాగం గుండ్రంగా, ఇంకొంత భాగం ఆవునాలిక లాగా ఉంటుంది.

ఈ భాగాలను కొద్ది కొద్దిగా కదిలిస్తూ స్త్రీకి తాపాన్ని కదిలిస్తూ మెల్లగా ఆమె భగాన్ని కదిలించాలి. అప్పుడు స్త్రీకి కొద్దిగా భావప్రాప్తి కలుగుతుంది. ఆ తర్వాతే పురుషుడు అంగప్రవేశానికి ఉపక్రమించాలి. 

-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------


స్త్రీ యోనిలో పురుషుడు తన అంగాన్ని చొప్పించడంలో పద్దతులు :: వాత్స్యాయన కామశాస్త్రం - 24



రతి సాగించేప్పుడు స్త్రీ యోనిలో పురుషుడు తన అంగాన్ని చొప్పించడంలో, ఆమెకు తృప్తి కలిగించడంలో అనేక పద్ధతులున్నాయని వాత్స్యాయనుడు చెబుతున్నాడు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.ఉపనృప్తకం, 2.మంథనం, 3.హలం, 4.అవమర్దనం, 5.పీడితకం, 6.నిర్ఘాతకం, 7.వరాహఘాతం, 8.వృషఘాతం, 9.చటకవిలసితం, 10.సంపుటం. వీటిని ఉపనృప్తాలు అని పిలుస్తారు.

అంగప్రవేశంలోనూ, అంగప్రవేశం తర్వాత ఈ క్రియలను అవలంబిస్తారు. వీటిని ఎలా చేయవచ్చో చూద్దాం.

1.పురుషుడు తన అంగాన్ని నేరుగా స్త్రీ యోనిలో ప్రవేశపెట్టడాన్ని ఉపనృప్తకం అని అంటారు. సాధారణంగా అందరూ అవలంబించే పద్ధతే ఇది.

2. చేత్తో అంగాన్ని పట్టుకుని స్త్రీ యోని లోపల భాగం అంతటా తిప్పటాన్ని మంథనం అని అంటారు.

3.పురుషుడు తన కటి ప్రదేశాన్ని కిందుగా ఉంచి, అంగాన్ని యోనిలోకి చొప్పించి, వెనుకకు, ముందుకు లాగుతూ ఉంటే హుళం అని పిలుస్తారు.

4.ఇదే క్రియను త్వరితగతిన చేస్తుంటే దానికి అపమర్దనం అని పేరు.

5.స్త్రీ యోనిలోకి ఎంతవరకూ అంగాన్ని ప్రవేశ పెట్టడానికి వీలుంటుందో అంతవరకూ ప్రవేశపెట్టి శక్తి కొద్దీ వెనుకకు, ముందుకూ లాగడాన్ని పీడితకం అని అంటారు.

6. యోనిలోపలికి పూర్తిగా అంగాన్ని ప్రవేశింప చేసిన తర్వాత పూర్తిగా వెనుకకు లాగి తిరిగి వేగంగా యోనిలోకి పొడుస్తున్నట్టు ప్రవేశపెట్టడాన్ని నిర్ఘాతం అని అంటారు.

7.యోనిలోకి ఒక పక్కగా మాత్రమే అంగాన్ని చొప్పించితే దానికి వరాహాఘాతం పేరు.
8.లింగాన్ని యోనిలోకి ఒకపక్కకు ఒకసారి, వేరొకపక్కకు వేరొకసారి చొప్పిస్తూ గుచ్చి గుచ్చి రతి చేస్తే దాన్ని వృషాఘాతం అని పిలుస్తారు.

9.అంగాన్ని ఒకసారి స్త్రీ యోనిలోకి ప్రవేశపెట్టిన తర్వాత బయటకు తీయకుండా మూడు, నాలుగు సార్లు పొడిస్తే దానికి చటక విలసితం అని పేరు. స్త్రీ కవళికలను బాగా పరిశీలించి ఆమె తృప్తి చెందిందని భావించినప్పుడు- అంటే ఆమె భావప్రాప్తి చెందినప్పుడు చటక విలసితం సాగించాలని శాస్త్రకారులు సూచిస్తున్నారు.


10.స్త్రీ, పురుషులు కాళ్ళు సాపుగా చాచుకుని, ఇద్దరి అంగాలూ బాగా కలిసేలా కౌగిలించుకుని రతి సాగిస్తే దాన్ని సంపుటం అని అంటారు.

ఈ ఉపనృపాలన్ని సాధారణంగా స్త్రీలు అందరికీ ప్రీతికరమైనవీ, ఆమోదయోగ్యమైనవే. అయితే స్త్రీ గుణగణాలను బట్టి ఉపనృప్తాల ప్రయోగంలో కొన్ని పద్ధతులు అనుసరించాలని వాత్స్యాయనుడు ప్రత్యేకంగా చెబుతున్నాడు.

స్త్రీ శారీరక స్థితిని బట్టి ఆమెకు కొన్ని రకాల ఉపనృప్తాలు మాత్రమే సరిగా వర్తిస్తాయని, వాటికే ఆమె అనందించగలుగుతుందని ఆయన వివరిస్తారు.

ఉపనృప్తాల ప్రయోగంలో కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. 
---------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------

 ఉపనృప్తాలు విషయంలో పాటించవలసిన జాగ్రత్తలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 25

ఉపనృప్తాల ప్రయోగం విషయంలో తొందర పనికిరాదు. మొరటుగా ప్రవర్తించ కూడదు. రతి ఆరంభ సమయంలో నెమ్మదిగా, సుతారంగా ప్రారంభించి సగం వరకూ వచ్చిన తర్వాత కొంత వేగంగానూ, చివరిలో ఉధృతంగానూ ప్రయోగించాలి.

ప్రియుడు, ప్రియురాలిని వివస్త్రను చేయడంతోనే బాహ్యోపనృప్తాలు ప్రయోగించినట్టే. స్త్రీ కూడా పురుషాయిత సమయంలో పురుషుడి దుస్తులు తీసివేసి బాహ్య పురుషాయితాలు కొనసాగించాలి.

పురుషోప్తనృప్తాలలో కొన్ని రకాలను ఇప్పుడు చూద్దాం.

సంభోగ సమయంలో ఉన్న అభ్యంతర పురుషాయితంలో
1. సందంశం,
2. భ్రమరకం,
3. ప్రేంఖోలితం అని మూడు రకాలున్నాయి.


పురుషుడి అంగాన్ని స్త్రీ తన చేత్తో పట్టుకుని యోని ముఖ ద్వారం వద్ద గట్టిగా రుద్దుకుంటూ అలాగా చాలా సేపు ఉండటాన్ని సందశం అని అంటారు.

స్త్రీ, పురుషుడి అంగాన్ని యోనిలో ప్రవేశపెట్టుకుని కాళ్ళు దగ్గరగా ముడుచుకుని చేతులు పురుషుడి శరీరంపై ఆనించి రతి చేస్తే దాన్ని భ్రమరకం అని అంటారు. దీనిని ఆచరించడానికి అభ్యాసం అవసరం. ఈ బంధంలో పురుషుడు తన నడుం ఎత్తుతూ స్త్రీకి సహాయపడాలి. అప్పుడే అతనికి సౌకర్యంగా ఉంటుంది.

స్త్రీ తన నడుం ముందుకు, వెనక్కూ ఊగిస్తూ రతి చేస్తే దాన్ని ప్రేంఖోలితం అని అంటారు. నడుమును అన్ని వైపులకూ గుండ్రంగా తిప్పితే భ్రమితం అని అంటారు.



ఈ క్రియల తర్వాత పురుషాంగంతో బంధం విడిపోకుండా పురుషుడి ముఖంమీద స్త్రీ తన ముఖం ఉంచి విశ్రాంతి తీసుకోవాలి.
స్త్రీ ఇలా విశ్రాంతి తీసుకున్నప్పుడు పురుషుడు ఆమె అలసట తీర్చేందుకు సాధారణ పద్ధతిలో రతికి ఉపక్రమించాలి అంటే ప్రియుడు రతి సాగించి పూర్తిగా అలసిపోయినప్పుడు స్త్రీ పురుషాయితానికి ఉపక్రమించి పురుషాయితానికి ఎలా ఉపక్రమించిందో అదే విధంగా పురుషుడు సాధారణ రతి సాగించాలి. పురుషాయితాల్లో ఈ పద్ధతులు ఎంతో ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తాయి. 
----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------
 
 మానవులలో శృంగారేచ్ఛ అతి సహజమైనది :: వాత్స్యాయన కామశాస్త్రం Part 26

మానవులలో శృంగారేచ్ఛ అతి సహజమైనది. ఈ కోరికకు మూలమైన ప్రేమ అనేది ఎక్కువగా స్త్రీ, పురుషుల మధ్య కొద్దిపాటి పరిచయం అయినా లేనిదే తొందరగా జనించదు.

ఒకవేళ జనిస్తే అది ప్రేమ అని మాత్రం చెప్పజాలం. కేవలం మోహం, కామం మాత్రమే అవుతుందది.

ఇలా ప్రేమ జనించడానికి స్త్రీ పురుషుల మధ్య పరిచయం అవసరమని చెప్పుకున్నాం కదా! ఈ పరిచయమే ప్రేమకు, తర్వాత శృంగారానికి దారి తీస్తుంది. పురుషులు స్త్రీలతో ఏర్పరచుకునే పరిచయం, అందులో రకాల గురించి ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా యవ్వనంలో పురుషుడికి ప్రేమ జనించడానికి అవకాశం ఉన్న స్త్రీలతో ఏర్పడే పరిచయాన్ని ప్రాధమికంగా రెండు రకాలుగా విభజించవచ్చు అని వాత్స్యాయనుడు చెబుతాడు. అదేమిటంటే.


వివాహం కాని యువతులతో కలిగే పరిచయం, వివాహమైన వారితో కలిగే పరిచయం. ఈ రెండు రకాల యువతులూ పరిచయం ద్వారానే పొందగలుగుతారు. ఇక్కడ పరిచయం ఏర్పడే విధానాన్ని బట్టి పరిచయాన్ని కూడా రెండు రకాలని చెబుతారు. అవి.

పురుషుడు తనంతట తానే స్వయంగా కల్పించుకుని చేసుకునే పరిచయం, రెండవది దూతల ద్వారా కాని, ఆ యువతితో పరిచయం ఉన్న వేరెవరి ద్వారానైనా పరిచయం ఏర్పరచుకోవడం. సరే! వివాహం కాని యువతులతో ఏర్పరచుకునే పరిచయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

వివాహం కాని యువతులు, అంటే కన్యలతో పరిచయం కొద్దిగా నైపుణ్యంతో సంపాదించుకోవాలి. మాటలతో, చేతలతో ఆమె మనసును రంజింపజేసి, తన వైపు ఆకర్షితురాలిని చేసుకోవాలి. వీలైనంత వరకు దూతల మీద ఆధారపడకూడదు.

దీనికి కారణాలు ఇలా వివరిస్తున్నాడు వాత్స్యాయనుడు.
వివాహం కాని యువతులకు అంతకు ముందు పురుషులతో ఇటువంటి తరహా పరిచయం కానీ, సయోగ అనుభవం కానీ పొంది ఉండరు. వారిలో కొద్దిపాటి జంకు తప్పని సరిగా ఉంటుంది. ఆ కన్యతో వివాహం కోరు పురుషుడు తనంతట తానే పరిచయం ఏర్పచుకోవాలి. దూతలను ఉపయోగించుకోవడం వల్ల విషయం బయటకు పొక్కడమే కాదు, మొదటికే మోసం రావచ్చు కూడా.



ఇక వివాహం అయిన యువతితో పరిచయం ఏర్పరుచుకోవడం దీనికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఎలాగంటే ,
వివాహమైన యువతికి అప్పటికే శృంగారానుభవం ఉంటుంది. భర్తతో శృంగారానుభవాన్ని పొందుతున్నప్పుడు ఆమె వేరొక వ్యక్తితో ఎందుకు ఆ సుఖాన్ని కోరుకుంటుంది? వేరొక వ్యక్తిపై మరులు కొని ఆ వ్యక్తి అంటే ఎందుకు ఆకర్షితురాలవుతుంది? అసలు ఎలా ఆకర్షితురాలవుతుంది?
ఇవి ప్రధాన ప్రశ్నలు.


దీనికి జవాబులు ఏమిటంటే... సాధారణంగా స్త్రీలలో చంచల స్వభావురాళ్ళు పరాయి పురుషుని పట్ల త్వరగానే ఆకర్షితులవుతారు. కాకపోతే ఇక్కడ ఆమెతో పరిచయం పెంచుకోగోరే పురుషునికి దూతల సహాయం అవసరమవుతుంది. దూతల సహాయం ఎందుకంటే విషయం నలుగురికీ తెలియకుండా గుట్టుగా సాగడం కోసమే.
కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇక్కడో నిజం ఉంది. దూతల సహాయం తీసుకోకపోవడానికీ, తీసుకోవడానికి కారణం ఒక్కటే.. 
 




No comments:

Post a Comment